తెలంగాణ

telangana

ETV Bharat / state

పాలమూరులో కొవిడ్ కలకలం... ఒక్కరోజే 254 కేసులు - ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో సోమవారం ఒక్కరోజే 254 కరోనా కేసులు

ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో కరోనా విలయతాండవం చేస్తోంది. సోమవారం ఒక్కరోజే 254 కేసులు నమోదయ్యాయి. జిల్లా అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ... కరోనా కట్టడికి కళ్లెం వేయలేకపోతున్నారు.

corona positive cases increasing in mahabunagar
సోమవారం ఒక్కరోజే 254 కరోనా కేసులు

By

Published : Aug 4, 2020, 11:02 AM IST

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో కొవిడ్‌-19 ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. సోమవారం ఒక్క రోజు 254 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా జోగులాంబ గద్వాల జిల్లాలో 103 కేసులు నమోదవడంతో జిల్లాలో కలవరం మొదలైంది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 63, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 51, వనపర్తి జిల్లాలో 29 మంది, నారాయణపేట జిల్లాలో ఏడు మంది కరోనా బారిన పడ్డారు.

జోగులాంబ గద్వాలలో శతకం...

జోగులాంబ గద్వాల జిల్లాలో ఒకే రోజు 103 కేసులు నమోదవడంతో జిల్లాలో కలవరం మొదలైంది. గద్వాల జిల్లాలో 13, అలంపూర్‌ నియోజకవర్గ పరిధిలో 39 నమోదవగా.. జిల్లాలో మరో 26 మంది, అయిజలో 15, ధరూరు మండలం ఉప్పేరులో 7 మంది, వడ్డేపల్లి, గట్టు, మార్లబీడు, మల్దకల్‌, తూర్పు గార్లపాడులొ ఒక్కొక్కరికి కరోనా పాజిటివ్‌ వచ్చింది.

మహబూబ్‌నగర్ జిల్లాలో 63 కేసులు నమోదు కాగా.. 43 పాజిటివ్‌ కేసులు జిల్లా కేంద్రానికి చెందినవే. అత్యధికంగా ఏనుగొండలో 8 మంది, నల్‌బౌలిలో నలుగురితో పాటు ఇతర వార్డులలో కేసులు నమోదయ్యాయి. జడ్చర్లలో 9, అడ్డాకులలో 3, దేవరకద్రలో ఇద్దరికి పాజిటివ్‌ వచ్చింది. సీసీకుంట మండలం అప్పంపల్లి, గండీడ్‌ మండలం దేశాయిపల్లి, నవాబుపేట మండలం లోకిరేవు, రాజాపూర్‌ మండలం ముదిరెడ్డిపల్లి, మూసాపేట మండలం నిజాలాపూర్‌, భూత్పూరులో ఒక్కొక్కరికి కరోనా సోకింది.

నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో...

నాగర్ కర్నూల్​ జిల్లా 52 కేసులు నమోదు కాగా... జిల్లా కేంద్రంలో 16 మంది కరోనా బారినపడ్డారు. జిల్లాలో మండలాల వారిగా.. అత్యధికంగా కల్వకుర్తి 12, అచ్చంపేట 7, కొల్లాపూర్‌లో 4, తాడురు, బిజినేపల్లి, అమ్రబాద్‌ మండల పరిధిలో ముగ్గురు చొప్పున, పెంట్లవెల్లిలో ఇద్దరు, ఉప్పునుంతల, తెల్కపల్లిలో ఒక్కొక్కరు కొవిడ్‌ బారిన పడ్డారు. వనపర్తి జిల్లాలో 29 కేసులు నమోదవగా.. జిల్లా కేంద్రంలో 10, పేబ్బేరులో 5 గురికి కరోనా నిర్ధారణ అయ్యింది. అమరచింత, పెద్దమందడి, రేవల్లిలో ముగ్గురుచొప్పున కరోనా ఉచ్చులో పడ్డారు. చిన్నంబావిలో ఇద్దరు, ఆత్మకూరు, గోపాల్‌పేట, పాన్‌గల్‌ మండలాల్లో ఒక్కొక్కరికి కరోనా పాజిటివ్‌ వచ్చింది.

నారాయణపేట జిల్లాలో 7 కేసులు నమోదవగా.. నారాయణపేట పట్టణంలో ముగ్గురు, మండలంలోని ఎక్లాస్‌పూర్‌, ఉట్కూరు మండలం పెద్దజట్రం, మక్తల్‌ మండలం పంచలింగాలతో పాటు పట్టణంలో ఒక్కొక్కరికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. గతంలో కొవిడ్‌ పాజిటివ్‌తో రాయిచూరులో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి మృతి చెందాడు.

ఇవీ చూడండి:గ్రేటర్‌లో కాస్త ఊరట... తాజాగా 273 మందికి వైరస్

ABOUT THE AUTHOR

...view details