తెలంగాణ

telangana

ETV Bharat / state

మన్యంకొండలో మంత్రి - kcr

పేదల తిరుపతి మన్యంకొండ భక్త జనంతో కిక్కిరిసిపోయింది. మొదటిసారిగా మంత్రి ప్రమాణ స్వీకారం చేసిన శ్రీనివాస్​ గౌడ్ స్వామి సేవలో పాల్గొన్నారు.

భక్తులకు హారతి ఇస్తున్న శ్రీనివాస్ గౌడ్

By

Published : Feb 20, 2019, 10:55 AM IST

Updated : Feb 20, 2019, 12:50 PM IST

.

మన్యంకొండ జాతరలో శ్రీనివాస్ గౌడ్
మహబూబ్​నగర్​ జిల్లా మన్యంకొండ శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి జాతర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన తేరు కార్యక్రమం వేలాది మంది భక్తులతో కిక్కిరిసిపోయింది. ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్వామి వారి సేవలో పాల్గొన్నారు.

ప్రమాణ స్వీకారం అనంతరం మొదటిసారి జిల్లాకు వచ్చిన ఆయన రథోత్సవ కార్యక్రమంలో పాల్గొని రథాన్ని లాగారు.
ముఖ్యమంత్రి కేసీఆర్​ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని మంత్రి తెలిపారు.

కొండ దిగువున ఏర్పాటు చేసిన రథాన్ని లాగేందుకు భక్తులు పోటీ పడ్డారు.

ఇవీ చదవండి:

మినీ మేడారం మొదలైంది

Last Updated : Feb 20, 2019, 12:50 PM IST

ABOUT THE AUTHOR

...view details