Crop Damage in Mahabubngar :ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో గత 20రోజుల నుంచి వానలు కురవక (No Rains in Telangana) వేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి ఎదురవుతోంది. ఉమ్మడి జిల్లాలో వానాకాలం సాధారణ సాగువిస్తీర్ణం 18లక్షల46వేల ఎకరాలు కాగా, ప్రస్తుతం 11లక్షల 70వేల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అందులో అత్యధికంగా 7లక్షల ఎకరాల్లో పత్తిసాగైంది. ప్రస్తుతం పత్తి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సీజన్ ప్రారంభంలో వానలు కురుస్తాయని విత్తనాలు వేసిన రైతులకు నిరాశే ఎదురైంది. వానల్లేక వేసిన విత్తులు తీసేసి మళ్లీ మళ్లీ వేయాల్సి వచ్చింది. అలా ఒక్కో రైతు 2నుంచి 3సార్లు విత్తనాలు నాటారు. ఆ తర్వాత జూలై రెండో వారం నుంచి నెలాఖరు వరకూ వానలు దంచికొట్టాయి.
ఆ వానలు ఎండిపోతాయి అనుకున్నా పంటలకు వూతమిచ్చాయి. కాని గడిచిన 20రోజుల నుంచి వానల్లేక అవే పంటలు ఎండిపోతున్నాయి. మొక్క వాడిపోతోందని, ఆకు, గూడ రాలిపోతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొద్దిరోజులు ఇలాంటి పరిస్థితే కొనసాగితే ఆశలు వదులుకోవాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దిగుబడి సైతం గణనీయంగా పడిపోతుందని చెబుతున్నారు.
Crop Damage Due To No Rains :పత్తి తర్వాత అత్యధికంగా సాగైన వర్షదార పంట మొక్కజొన్న. సుమారు 90వేల ఎకరాల్లో ఈసారి రైతులు మొక్కజొన్న సాగుచేశారు. వానల్లేక ఆ పంట సైతం ఎండిపోతోంది. ఇప్పటికే ఆరేడు అడుగులు పెరగాల్సిన మొక్క ఎత్తు నాలుగైదు అడుగులకు మించలేదు(Crop damage to no Rains). నీరు లేక కంకి సైతం నాణ్యంగా లేదని రైతులు చెబుతున్నారు. ఇప్పటికే కొందరు రైతులు ఆశల్లేక పంటను అలాగే వదిలేశారు. ఎకరాలకు 30 నుంచి 40 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా, ఐదారు క్వింటాళ్లుదాటదని రైతులు అంచనా వేస్తున్నారు.
Cotton Farmers Problems in Telangana : వరుణుడు కరుణించేనా.. అన్నదాతకు కన్నీళ్ల సాగు తప్పేనా