తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఇక ప్రజా ఉద్యమం చేయాల్సిందే' - tsrtc strike latest updates

సమ్మె విరమించి విధుల్లో చేరతామని ఆర్టీసీ కార్మికులు విన్నవించినా... చేర్చుకునే పరిస్థితి లేదని ముఖ్యమంత్రి కేసీఆర్​ చెప్పడం దారుణమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు.

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

By

Published : Nov 23, 2019, 8:56 AM IST

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

ఆర్టీసీ కార్మికుల సమ్మెను ఉపయోగించుకుని ఆర్టీసీని కార్పొరేట్​ శక్తులకు శాశ్వతంగా అప్పగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్​ కుట్ర పన్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం దుయ్యబట్టారు. ఈ పరిస్థితి ఎదుర్కొనేందుకు రాష్ట్రంలో ప్రజా ఉద్యమం నిర్వహించాల్సిందేనని పేర్కొన్నారు.

ఆర్టీసీ కార్మికులకు ఆశలు కల్పించి ప్రభుత్వానికి అనుకూలంగా హైకోర్టు తీర్పునిచ్చిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు.

సమ్మె విరమించి విధుల్లో చేరతామని ఆర్టీసీ కార్మికులు విన్నవించినా... చేర్చుకునే పరిస్థితి లేదని ముఖ్యమంత్రి కేసీఆర్​ చెప్పడం దారుణమని మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details