ముఖ్యమంత్రి కేసీఆర్ అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని వామపక్షాల నేతలు మండిపడ్డారు. కార్మికుల సమ్మె ఆర్టీసీ ముగింపుకు నాంది అని మాట్లాడడం సరికాదంటూ నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీపై మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నిరసన చేపట్టారు. దిక్కు మాలిన సంఘాలు అని సంభోదించడం కేసీఆర్కు తగదని.. ఆ ప్రజా, కార్మిక సంఘాల ద్వారానే ఆయన ముఖ్యమంత్రి అయ్యారని గుర్తుంచుకోవాలన్నారు. బేషజ్వాలకు పోకుండా ఆర్టీసీ కార్మికులను చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు.
సమ్మెకు మద్దతుగా ఆందోళన చేపట్టిన వామపక్షాల నేతలు
మహబూబ్నగర్లో వామపక్షాల నేతలు ఆందోళన చేపట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ భేషజాలకు పోకుండా ఆర్టీసీ కార్మికులను చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు.
సమ్మెకు మద్దతుగా ఆందోళన చేపట్టిన వామపక్షాల నేతలు