మహబూబ్నగర్జిల్లాలో తాజాగా మరో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పట్టణానికి చెందిన ఓ మహిళతో పాటు గండీడ్ మండలానికి చెందిన మరో మహిళకు హైదరాబాద్‌లో శస్త్ర చికత్స జరిగింది. కొవిడ్- 19 పరీక్ష నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలింది.
భూత్పూర్ మండలంలోని ఓ గ్రామంలో ఇటీవల నమోదైన రెండు కరోనా పాజిటివ్ కేసులకు సంబంధించి ప్రైమరీ కాంట్రాక్టులకు పరీక్షలు నిర్వహించగా.. మరో ఇద్దరికి వైరస్ ఉన్నట్లుగా నిర్ధరించారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరికి ఇది వరకే పాజిటివ్ రాగా... ఇప్పుడు మరో ఇద్దరికి పాజిటివ్‌గా వచ్చింది. జిల్లా కేంద్రంలో మరొకరికి వ్యాధి నిర్ధరణ అయింది. జిల్లాలో క్రియాశీలంగా ఉన్న మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య పదికి చేరింది.