మహబూబ్‌నగర్ మోతినగర్‌లో మంగళవారం తెరాస ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి తరఫున హోంమంత్రి మహముద్ అలీ, అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రచారం నిర్వహించారు. తెరాస ఎంపీ అభ్యర్థులు 16 మందిని గెలిపించుకుంటే "కేసీఆర్ ప్రధాని అవుతారు... మన సీనన్నా సీఎం అవుతారు" అని చెప్పి స్థానిక కౌన్సిలర్ పాషా అందరిని ఆశ్చర్యపరిచారు. ఈ మాటతో సభలో ఒక్కసారి నవ్వులు విరిశాయి. అవాక్కైన శ్రీనివాస్ గౌడ్ వెంటనే తేరుకొని పాషా చేతిలోని మైకును లాక్కున్నారు."కేసీఆర్ ప్రధాని... కేటీఆర్ సీఎం అవుతారు'" అని మంత్రి సవరించడమే కాకుండా సభలో ఉన్న వారితో పలుమార్లు ఆ మాటలను పలికించారు.
సీఎంను ప్రకటించిన కౌన్సిలర్... అవాక్కైన మంత్రి..! - Councillor_On_Srinivas_Goud
మహబూబ్‌నగర్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చేపట్టిన ఎన్నికల ప్రచారంలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. సమావేశంలో పాల్గొన్న కౌన్సిలర్... మంత్రినే అవాక్కయ్యేలా చేశారు. ఒకవేళ కేసీఆర్ ప్రధాని ఐతే... రాష్ట్ర సీఎం అభ్యర్థిని ప్రకటించి ఆశ్చర్యచకితుల్ని చేశారు.
ఎన్నికల ప్రచారంలో విచిత్ర సంఘటన
TAGGED:
Councillor_On_Srinivas_Goud