తెలంగాణ

telangana

By

Published : Nov 8, 2020, 10:58 AM IST

ETV Bharat / state

దేశానికి అన్నం పెట్టే స్థాయిలో తెలంగాణ: దేవరకద్ర ఎమ్మెల్యే

ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందేందుకు రైతులు నాణ్యమైన పత్తిని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి కోరారు. ఈ మేరకు మహబూబ్‌నగర్‌ జిల్లా బలీద్‌పల్లిలో సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. భారీ వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను మానవతాదృక్పథంతో ఆదుకోవాలని సీసీఐకి విజ్ఞప్తి చేశారు. పంట నిల్వ కోసం అధిక సంఖ్యలో గోదాములను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.

cotton purchasing centres opened in mahabubnagar district
దేశానికి అన్నం పెట్టే స్థాయిలో తెలంగాణ: దేవరకద్ర ఎమ్మెల్యే

ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందేందుకు రైతులు నాణ్యమైన పత్తిని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి కోరారు. శనివారం అడ్డాకుల మండలం బలీద్ పల్లిలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సంవత్సరం భారీ వర్షాల వల్ల పంట నష్టపోయి రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని, నాణ్యమైన పత్తి దిగుబడి చాలా చోట్ల లేదని అందువల్ల మానవతా దృక్పథంతో కొనుగోలు చేయాలని సీసీఐని విజ్ఞప్తి చేశారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కరోనా సమయంలోనూ.. వారు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసిందని అన్నారు.

అధిక సంఖ్యలో గోదాములు

సాగునీటి ప్రాజెక్టులు, ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని అన్నారు. గత సంవత్సరం కోయిల్ సాగర్ ప్రాజెక్టు తెగిపోగా వెంటనే పునర్నిర్మించినట్లు వెల్లడించారు. నియంత్రిత వ్యవసాయ విధానం ద్వారా అధిక దిగుబడులు సాధించేందుకు రైతులు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. పంట నిల్వకు గతేడాది 18 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాములు నిర్మించగా, ఈ సంవత్సరం 40 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం దేశానికి అన్నం పెట్టే స్థాయిలో రాష్ట్రం ఉందని కొనియాడారు. డిమాండ్ ఉన్న పంటలు పండించి లాభాలు గడించాలని రైతులకు సూచించారు. పామాయిల్ తోటల పెంపకం వల్ల ఎకరాకు రూ. లక్ష నుంచి లక్షన్నర వరకు ఆదాయం పొందవచ్చని ఎమ్మెల్యే వెల్లడించారు.

నిరాడంబరంగా పాలముర్తి తిరుపతి ఉత్సవాలు

కరోనా తీవ్రత దృష్ట్యా కురుమూర్తి స్వామి ఉత్సవాలను ఈ సంవత్సరం నిరాడంబరంగా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ భక్తులు దైవ దర్శనం చేసుకోవచ్చని పేర్కొన్నారు.

జిల్లాలో 5 పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు అదనపు కలెక్టర్ సీతారామారావు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం పత్తికి క్వింటాలుకు రూ. 5,820 మద్దతు ధర ప్రకటించినట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:కోహ్లీని కెప్టెన్​గా తప్పించాలనడం సరికాదు: సెహ్వాగ్

ABOUT THE AUTHOR

...view details