మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రజాప్రతినిధి కరోనా బారిన పడ్డాడు. దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. భూత్పూర్ పీహెచ్సీలో నిర్వహించిన పరీక్షల్లో వైరస్ సోకినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వారం నుంచి తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్యే కోరారు.
దేవరకద్ర ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ - మహబూబ్‌నగర్ వార్తలు
మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డికి కరోనా పాజిటివ్‌గా వచ్చింది. భూత్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరీక్ష నిర్వహించగా వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. గతవారం తనను కలిసిన వారందరూ పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
![దేవరకద్ర ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ Corona positive for Devarakadra MLA today tested at bhuthpur phc](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9791563-54-9791563-1607326440985.jpg)
దేవరకద్ర ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్
నియోజకవర్గంలో పలు అభివద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొనాల్సి ఉండగా అన్నింటిని రద్దు చేసుకున్నారు. తాను హాజరు కావాల్సిన పనులన్నీంటిని స్థానిక ప్రజాపతినిధులకు అప్పగించారు. జిల్లా కలెక్టరేట్లో జరిగే ఆయకట్టు రైతుల సమావేశంలో నియోజకవర్గ రైతులు పాల్గొనాలని ఎమ్మెల్యే సూచించారు.
ఇదీ చూడండి:తెలంగాణకు కోటిన్నర కొవిడ్ టీకాలు.. సర్కారు ప్రణాళికలు
Last Updated : Dec 7, 2020, 6:21 PM IST