మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటక కేంద్రాలలో ఒకటైన కోయిల్ సాగర్ ప్రాజెక్ట్‌ను సందర్శించేందుకు జిల్లా నలుమూలల నుంచి అత్యధికంగా వస్తుంటారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో... కోయిల్ సాగర్ ప్రాజెక్టు పరిధిలో ఉన్న బొల్లారం గ్రామస్థులకు కరోనా సోకే అవకాశం ఉంది. అయితే పర్యాటకులకు అనుమతి ఇచ్చేందుకు నిరాకరించారు.
నిండుకుండలా కోయిల్‌సాగర్.. పర్యాటకులకు అనుమతి నిరాకరణ - నిండుకుండలా మారిన కోయిల్‌సాగర్
మహబూబ్‌నగర్ జిల్లాలోని కోయిల్ సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. జల సవ్వడి చేస్తూ గేట్ల ద్వారా పరవళ్లు తొక్కుతూ బయటకు వస్తున్నా నీటిని చూసేందుకు పర్యాటకుల తాకిడి పెరిగింది. అయితే కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో... బొల్లారం గ్రామస్థులకు కరోనా సోకే అవకాశం ఉందని పర్యాటకులకు అనుమతి ఇచ్చేందుకు నిరాకరించారు.

corona effect on Koil Sagar project
స్థానిక పోలీసులు సైతం పంచాయతీ తీర్మానాన్ని గౌరవిస్తూ.. పర్యాటకులు కోయిల్‌సాగర్ ప్రాజెక్టు సందర్శనకు రాకుండా గ్రామ సమీపంలోనే బారికేడ్లను ఏర్పాటు చేశారు. కోయిల్ సాగర్ సందర్శించాలనుకున్నా... పర్యాటకులకు కరోనా ప్రభావంతో సాగర్ పరవళ్లు చూసే అవకాశం లేకుండా పోయింది.
ఇదీ చదవండి: ఫేస్బుక్ సీఈఓకు కాంగ్రెస్ లేఖ, శివసేన గరం!