మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లిలోని ఫార్మా కంపెనీల్లో కరోనా కలవరపెడుతోంది. ఇక్కడ పరిశ్రమల్లో పనిచేసేవారు ఎక్కువ మంది వైరస్ బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. స్థానికంగా 54 మందికి కొవిడ్ సోకగా... వారిలో ఎక్కువగా ఫార్మా ఉద్యోగులే ఉండటం కలవరపెడుతోంది.
జడ్చర్లలోని ఫార్మా కంపెనీల్లో కరోనా కలవరం - జడ్చర్లలో కరోనా కలవరం
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లిలోని ఫార్మా కంపెనీల్లో కరోనా కలవరపెడుతోంది. ఇక్కడ పరిశ్రమల్లో పనిచేసేవారు ఎక్కువ మంది వైరస్ బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది.
ఈ అంశంపై కలెక్టర్ వెంకట్రావు... అధికారుల బృందాన్ని నియమించి పరిస్థితికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. జిల్లా వైద్యాధికారి కృష్ణ ఆర్డీవో శ్రీనివాస్, ఇతర సభ్యులు పరిశ్రమల్లో పరిశీలించి కారణాలను విశ్లేషిస్తున్నారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో జడ్చర్లలో ఈనెల 24 నుంచి ఆగస్టు 3 వరకు అన్ని వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూసివేయాలని వ్యాపారస్తులు నిర్ణయించారు. కరోనా వ్యాప్తి విషయంలో ఆందోళన చెందొద్దని.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. వైరస్ ను నియంత్రించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టిందని, ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.