జీహెచ్ఎంసీతోపాటు జిల్లాల్లోనూ కరోనా విజృంభిస్తోంది. మహబూబ్నగర్ జిల్లాలో సోమవారం అత్యధికంగా 50 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో ఇద్దరు పోలీసు సిబ్బందితోపాటు ఉద్యోగులు ఉన్నారు.
మహబూబ్నగర్లో ఒక్కరోజే 50 పాజిటివ్ కేసులు - కరోనా కేసులు వార్తలు
రాష్ట్రంలోని జిల్లాలో కరోనా తన పంజా విసురుతోంది. పోలీసులు, వైద్యులు, పలువురు ప్రజా ప్రతినిధులు సైతం వైరస్ బారిన పడుతున్నారు. పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో అధికారులు కంటైన్‌మెంట్ జోన్లను ఏర్పాటు చేస్తున్నారు.
![మహబూబ్నగర్లో ఒక్కరోజే 50 పాజిటివ్ కేసులు corona-cases-raised-in-mahaboobnagar-district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8107799-thumbnail-3x2-covid.jpg)
మహబూబ్నగర్లో ఒక్కరోజే 50 పాజిటివ్ కేసులు
కొత్త కేసులతో జిల్లాలో బాధితుల సంఖ్యం 335కు చేరింది. మహబూబ్నగర్ పట్టణంలో పలు కాలనీలకు చెందిన 39 మంది కోవిడ్ బారిన పడ్డారు. జడ్చర్లలో 9, బాలానగర్‌లో 3 కేసులు నమోదు కాగా.. సీసీకుంట, బోయపల్లి, ధమాయపల్లి, రాజాపూర్లలో ఒక్కొక్క కేసు నమోదయ్యాయి. ప్రస్తుతం జిల్లాలో 161 కంటైన్‌మెంట్ జోన్లను అధికారులు ఏర్పాటు చేశారు.
ఇదీ చూడండి:టీపీసీసీ అధ్యక్షుని ఎంపిక కోసం మల్లగుల్లాలు.. పీఠం ఎవరికి దక్కేనో..!