ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మరో 56 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో ఓ పోలీస్, ఓ రెవెన్యూ ఉద్యోగి ఉన్నారు. ఇప్పటివరకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 964కు చేరుకుంది.
ఉమ్మడి మహబూబ్నగర్లో కరోనా కలవరం..
జిల్లాల్లోనూ కరోనా విస్తరిస్తోంది. పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. పరీక్షల సంఖ్య పెంచడంతో కేసులు అధికంగా వెలుగు చూస్తున్నాయి. పోలీసులు, రెవెన్యూ అధికారులు, బాధితులకు వైద్యం అందించే సిబ్బంది సైతం కొవిడ్ బారిన పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా @964
జోగులాంబ గద్వాల జిల్లాలో 30 కరోనా కేసులు నమోదయ్యాయి. జిల్లా కేంద్రంలోనే 15మంది వైరస్ బారిన పడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 10 మంది కొవిడ్-19 నిర్ధరణ అయింది. నారాయణపేట, నాగర్కర్నూల్ ఒక్కో జిల్లాలో 8మందికి వైరస్ సోకింది. వనపర్తిలో ని్నన ఒక్క కేసు నమోదు కాకపోవడంతో స్వల్ప ఊరట లభించింది.