గత వారం రోజులుగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో విజృంభించిన కరోనా... ఆదివారం కాస్తా కనికరం చూపింది. 200 నుంచి మూడు వందలకు పైగా నమోదైన కేసులు 110కి పడిపోయారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో 39, మహబూబ్‌నగర్ జిల్లాలో 29, వనపర్తి జిల్లాలో 20, జోగులాంబ గద్వాల జిల్లాలో 18, నారాయణపేట జిల్లాలో నలుగురు కొవిడ్ బారిన పడ్డారు.
నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో 8 మంది కొవిడ్ బారిన పడగా.. తాడూరు 7, కల్వకుర్తి, కొల్లాపూర్‌లో ఐదుగురు చొప్పున, అచ్చంపేట 4, వెల్దండ 3, బిజినేపల్లి, వంగూరులో ఇద్దరు, కోడేరు, పెద్దకొత్తపల్లి, పెంట్లవెల్లిలో ఒక్కొక్కరికి కరోనా నిర్ధరణ అయ్యింది.
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో 13 మందికి, జడ్చర్లలో 12 మందికి కరోనా పాజిటివ్ నిర్ధరణ కాగా.. కోయిల్‌కొండలో ఇద్దరు, నవాబుపేట, భూత్పూరులో ఒక్కొక్కరు కొవిడ్ బారిన పడ్డారు. వనపర్తి జిల్లా కేంద్రంలో 16 మందికి కరోనా నిర్ధరణ అయ్యింది. గోపాల్‌పేటలో ఇద్దరు, కొత్తకోట, పెబ్బేరులో ఒక్కొక్కరు వైరస్ బారిన పడ్డారు.
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో 12 మందికి, మల్దకల్‌లో నలుగురు, ఉండవెల్లి, ధరూరులో ఒక్కొక్కరు కరోనా బారిన పడ్డారు. నారాయణపేట జిల్లాలో నాలుగు పాజిటివ్ కేసులు నమోదు కాగా... జిల్లా కేంద్రానికి చెందిన ఒక్కరు, మక్తల్‌కు చెందిన ముగ్గురు కొవిడ్ బారిన పడ్డారు.