తెలంగాణ

telangana

ETV Bharat / state

జడ్చర్లలో సంపూర్ణంగా కొనసాగుతోన్న స్వచ్ఛంద బంద్‌ - స్వచ్ఛంద బంద్​ వార్తలు

మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలో ఇప్పటి వరకు 100 పాజిటివ్ కేసులు నమోదు కావడం స్థానికులను కలవరపెడుతోంది ఈ నేపథ్యంలో కరోనాను కట్టడి చేసేందుకు వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బంద్‌కు నిర్ణయం తీసుకున్నాయి. గత రెండు రోజులుగా సంపూర్ణంగా వ్యాపార సంస్థలు మూసివేశారు. కొన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రజలు బంద్‌కు సహకరిస్తున్నారు.

జడ్చర్లలో సంపూర్ణంగా కొనసాగుతోన్న స్వచ్ఛంద బంద్‌
జడ్చర్లలో సంపూర్ణంగా కొనసాగుతోన్న స్వచ్ఛంద బంద్‌

By

Published : Jul 25, 2020, 11:40 PM IST

మహబూబ్‌నగర్‌ జిల్లాలోనే అత్యధికంగా జడ్చర్లలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఫార్మసీల్లో పనిచేసే ఉద్యోగులు ఎక్కువమంది మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటివరకు వందకు పైగా కేసులు నమోదయ్యాయి. ఫార్మా పరిశ్రమలో పని చేసేవారు జడ్చర్లలో ఎక్కువమంది నివాసం ఉండటం ఇక్కడ మహమ్మారి వ్యాపికి కారణమవుతోంది.

అయితే వైరస్‌ను కట్టడి చేసేందుకు స్వచ్ఛందంగా బంద్‌కు వ్యాపారస్తులు నిర్ణయం తీసుకున్నారు. కిరాణం, బంగారం, ఎలక్ట్రానిక్స్ తదితర అన్ని వ్యాపార సంస్థలు మూసివేసేందుకు నిర్ణయించారు. గత రెండు రోజులుగా బంద్‌ సంపూర్ణంగా కొనసాగుతోంది. ప్రజలు కూడా అత్యవసర పరిస్థితుల్లో తప్ప.. బయటకు రావట్లేదు. జిల్లా కలెక్టర్ వెంకట్రావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కృష్ణ, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఇటీవల సందర్శించి ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కోరారు.

ఇవీ చూడండి:రాష్ట్రంలో అంతకంతకూ విజృంభిస్తున్న కరోనా..

ABOUT THE AUTHOR

...view details