మహబూబ్‌నగర్‌లో హాట్స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ వెంకట్రావు నిన్న పర్యటించారు. లాక్డౌన్ ముగిసే వరకూ ఎవరూ ఇళ్లలోంచి బయటకు రావద్దని, నిత్యవసరాలు అన్ని అందుబాటులో ఉన్నాయన్నారు. కరోనా సోకిన వ్యక్తులతో ఇంకా ఎవరైనా సన్నిహితంగా ఉన్నారా అని ఆరా తీశారు. ఏ సమస్య ఎదురైనా అధికారులకు లేదా కంట్రోల్ రూం నెంబర్‌కు సమాచారం ఇవ్వాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.
'ఏవైనా సమస్యలుంటే వెంటనే సంప్రదించండి' - రెడ్ జోన్ ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటన
మహబూబ్‌నగర్‌లో హాట్స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ వెంకట్రావు శనివారం తిరిగి పరిశీలించారు. జిల్లా ప్రజలకు నిత్యావసర సరుకుల కొరత లేకుండా ఉండేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే సంబంధిత అధికారులకు లేదా కంట్రోల్ రూం నెంబర్‌కు తెలపాలని సూచించారు.
మహబూబ్‌నగర్ పట్టణ ప్రజలకు లాక్డౌన్ సమయంలో సరుకులు, మందులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. జిల్లా అధికారులు, ఆన్లైన్ నిత్యావసర సరుకులు సరఫరా చేసే వారితో ఆయన సమావేశమయ్యారు. ఆన్లైన్లో సరుకులు, మెడిసిన్ ఆర్డర్ చేస్తే ఇంటివద్ద వస్తువులను అందించే సేవలు జిల్లాలో ఉన్నాయని చెప్పారు. డైలీ కార్ట్ ఆండ్రాయిడ్ యాప్‌లో మీకు కావలసిన వస్తువులను ఆర్డర్ చేయవచ్చన్నారు. మెడిసిన్‌ను అపోలో మెడికల్ స్టోర్ ద్వారా ఆన్లైన్లో తెప్పించుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. లాక్‌డౌన్‌ను పొడిగిస్తే ప్రస్తుతం ఎలా కట్టుదిట్టం చేశామో అలానే కొనసాగించాలన్నారు. డ్రోన్ల ద్వారా రెడ్ జోన్లలో ఉన్న వారి ప్రతి కదలికను కనిపెడతామన్నారు.
ఇదీ చూడండి :ఔషధాల లేమి... పొంచి ఉన్న ప్రమాదం