తెలంగాణ

telangana

ETV Bharat / state

భవన నిర్మాణ కార్మికుల నిధులు దారి మళ్లింపు: కొత్తకోట దయాకర్​ రెడ్డి - భవన నిర్మాణ కార్మికుల నిధులు వాడుకోకుడదు:కొత్తకోట దయాకర్​ రెడ్డి

కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో విధించిన లాక్‌డౌన్‌తో భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొత్తకోట దయాకర్‌ రెడ్డి అన్నారు. కష్టకాలంలో వారిని ఆదుకోవాల్సిన తెలంగాణ సర్కార్.. వారి నిధులను సైతం.. ఇతర అవసరాలకు మళ్లించిందని ఆరోపించారు.

construction workers are in trouble at mahaboobnagar
భవన నిర్మాణ కార్మికుల నిధులు దారి మళ్లింపు:కొత్తకోట దయాకర్​ రెడ్డి

By

Published : Jul 4, 2020, 7:19 AM IST

రాష్ట్ర ప్రభుత్వ భవన నిర్మాణ కార్మికుల నిధులను మళ్లించి ప్రభుత్వం ఖజానాను నింపుకుందని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొత్తకోట దయాకర్‌ రెడ్డి మహబూబ్​నగర్​లో ఆరోపించారు. తెలంగాణలో 15లక్షల మంది భవన నిర్మాణ కార్మికులుంటే... లాక్‌డౌన్‌ నేపథ్యంలో 8లక్షల 50వేల మంది మాత్రమే రెన్యూవల్‌ చేసుకున్నారని.. మిగతా 6లక్షల 71 వేల మంది దూరంగా ఉన్నారన్నారు.

ఉపాధి లేక రోడ్డున పడ్డ కార్మికులను ప్రభుత్వం వారికి కేటాయించిన నిధులతో ఆదుకోవాల్సింది పోయి.. ఆ మొత్తాన్ని దారి మళ్లించిందని ఆరోపించారు. భవన నిర్మాణ కార్మికుల నిధులు వాడుకోకూడదని సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్న భేఖాతరు చేశారని మండిపడ్డారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అందిన నిధులు, సరుకుల వివరాలు బహిరంగ పర్చాలని కోరారు. వాటి ఖర్చులను సైతం తెలపాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చూడండీ:పెండింగ్‌లోని భూ సమస్యలను పరిష్కరించాలి: కలెక్టర్

ABOUT THE AUTHOR

...view details