minister Srinivas goud : మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర జరిగినట్లు సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఆయన సోదరుడు శ్రీకాంత్ హత్యకు సుపారీ గ్యాంగ్‌తో కుట్రపన్నినట్లు తెలిపారు. అయితే మంత్రి హత్య కుట్రను భగ్నం చేసి.. నలుగురిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర
19:58 March 02
మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర
మహబూబ్‌నగర్‌కు చెందిన యాదయ్య, విశ్వనాథ్, నాగరాజు.. సుపారీ గ్యాంగ్‌తో హత్య చేయాలని భావించినట్లు పోలీసులు తెలిపారు. ఇందుకోసం ఫరూక్ అనే వ్యక్తికి సుపారీ ఇచ్చేందుకు యత్నించారు. అయితే ఈ విషయాన్ని ఫరూక్.. పేట్‌బషీరాబాద్ పోలీసులు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. యాదయ్య, విశ్వనాథ్, నాగరాజును అరెస్టు చేశారు. అనంతరం దర్యాప్తు చేపట్టారు.
నిందితుల్లో ఒకరైన నాగరాజు ఇచ్చిన సమాచారంతో.. దిల్లీలోని భాజపా నేత జితేందర్ రెడ్డి నివాసంలో రఘును అరెస్ట్ చేశారు. రఘుకు ఆశ్రయం ఇచ్చిన మరో ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. విచారించిన అనంతరం ముగ్గురినీ విడిచిపెట్టారు. హత్య కుట్ర కోణాన్ని దిల్లీ పోలీసులకు సైబరాబాద్ పోలీసులు తెలియజేశారు.
ఇదీచూడండి:భాజపా నేత ఇంట్లో కిడ్నాప్ కలకలం.. డ్రైవర్ సహా నలుగురి అపహరణ