తెలంగాణ

telangana

ETV Bharat / state

జడ్చర్లలో కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం

జడ్చర్లలోని కాంగ్రెస్​ పార్టీ సమావేశం రసాభాసగా మారింది. ఇటీవల నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టిన అనిరుధ్​ రెడ్డిని వ్యతిరేకిస్తూ మాజీ ఎమ్మెల్యే మల్లు రవి వర్గీయులు నిరసన వ్యక్తం చేశారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం తీవ్రమై... సమావేశాన్ని  వాయిదా వేయాల్సి వచ్చింది.

By

Published : Apr 3, 2019, 12:13 AM IST

గొడవపడుతున్న కాంగ్రెస్​​ కార్యకర్తలు

కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం
జడ్చర్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జీగా మొన్నటివరకు పీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మల్లురవి కొనసాగారు. ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో ఆయనను నాగర్​కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి అధిష్ఠానం బరిలో నిలిపింది. ఇందువల్ల నియోజకవర్గం సమన్వయ బాధ్యతలు పీసీసీ కార్యదర్శి అనిరుధ్​ రెడ్డికి అప్పగించారు. ఇవాళ దీనిపై సమావేశం ఏర్పాటు చేశారు. భేటీలో గత శాసనసభ ఎన్నికల్లో మల్లు రవి ఓటమికి అనిరుధ్​ రెడ్డి కూడా ఒక కారణమని రవి వర్గీయులు ఆరోపించారు.

సమావేశం నిర్వహించవద్దని వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. నాయకులు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేక తాత్కాలికంగా వాయిదా వేయాల్సి వచ్చింది. తనకు అప్పగించిన బాధ్యతలను పూర్తి చేశానని ఎవరికీ ద్రోహం, అన్యాయం చేయలేదని అనిరుధ్​ రెడ్డి అన్నారు.

మల్లు రవి పార్లమెంట్​ ఎన్నికల పోటీలో నిలవటం వల్ల ఆయన సూచన మేరకే తనకు పార్టీ బాధ్యతలు అప్పగించిందని, అందరం కలిసి పని చేద్దామని అనిరుధ్ రెడ్డి కార్యకర్తలకు సూచించారు.

ఇవీ చూడండి:రెండు మాసాల్లో కొత్త రెవెన్యూ చట్టం తెస్తాం: కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details