తెలంగాణ

telangana

ETV Bharat / state

Congress Ticket War in Palamuru : ఉమ్మడి పాలమూరులో కాంగ్రెస్ టికెట్​ దక్కించుకునేదెవరు..? - Telangana Assembly Elections 2023

Congress Ticket War in Palamuru : సర్వేలు ఏం చెబుతున్నాయి..? వాటి ఆధారంగా కాంగ్రెస్‌ నుంచి టిక్కెట్లు దక్కెదెవరికి..? అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే విషయంలో ఇన్నేళ్లూ పార్టీకి సేవ చేసిన పాతనాయకులకు ప్రాధాన్యం ఇస్తారా..? సానుకూల పవనాల గాలికి కొత్తగా పార్టీలో చేరిన నేతలకు పట్టం కడతారా? ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రస్తుతం రాజకీయవర్గాల్లో సాగుతున్న చర్చ ఇది. కర్ణాటక తరహా ఎన్నికల వ్యూహాలతో రాష్ట్రంలో అధికారంలోకి రావాలని చూస్తున్న కాంగ్రెస్‌కు.. అభ్యర్థిత్వాల ఖరారు సవాలుగా మారనుంది. టిక్కెట్లు దక్కేవాళ్లు సరే.. ఆశించి భంగపడ్డ నాయకులు వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేస్తారా అన్నది సందేహమే. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ టిక్కెట్ కోసం నెలకొన్న తీవ్రమైన పోటీపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

Congress Ticket War in Palamuru
Telangana Congress

By ETV Bharat Telangana Team

Published : Sep 21, 2023, 9:48 PM IST

Congress Ticket War in Palamuru ఉమ్మడి పాలమూరు కాంగ్రెస్ నుంచి టికెట్​ దక్కించుకునేదెవరు

Congress Ticket War in Palamuru : ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని 14 నియోజకవర్గాల్లోకాంగ్రెస్నుంచి టిక్కెట్ దక్కించుకునేదెవరు..? ఇదే ఇప్పుడు పాలమూరులో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఉమ్మడి జిల్లాలో ఇతర పార్టీల నుంచి రోజుకో నాయకుడు.. అధిష్ఠానం పెద్దల సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో(Telangana Assembly Elections 2023) టిక్కెట్ దక్కేది తమకేనని ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. భారీగా నేతలు చేరుతున్న తరుణంలో.. ఇన్నేళ్లు పార్టీకి సేవలు చేసిన తమకు టిక్కెట్టు దక్కుతుందో లేదోనని పాతనాయకులు ఆందోళనకు గురవుతున్నారు. అభ్యర్థిత్వం కోసం ఇప్పటికే ఆశావహులు హైదారాబాద్, దిల్లీలో మకాం వేసి జోరుగా పైరవీలు చేస్తున్నారు. అధిష్ఠానం మాత్రం సర్వే నివేదికలు(Survey Reports) ఎవరికి అనుకూలంగా ఉంటే వారినే బరిలో దించుతామని చెబుతోంది.

Congress MLA Candidate Leaders in Mahabubnagar :కొడంగల్ నుంచి పీసీసీ సారథి రేవంత్ మాత్రమే పోటీలో ఉన్నారు. అలంపూర్ నియోజక వర్గంలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ బలమైన అభ్యర్థిగా ఉన్నారు. వీరిద్దరి అభ్యర్థిత్వాలు దాదాపుగా ఖరారైనట్లేనని తెలుస్తోంది. మహబూబ్​నగర్ నియోజకవర్గం నుంచి ఏడుగురు టిక్కెట్ల కోసం దరఖాస్తు(Congress MLA Tickets) చేసుకున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​రెడ్డి, సీనియర్ న్యాయవాది వెంకటేశ్ బీజేపీను వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వీరితో పాటు మాజీ డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్ మహబూబ్​నగర్ టిక్కెట్(Mahabubnagar MLA Ticket) ఆశిస్తున్నారు. వీరిలో ఎవరికి టిక్కెట్ దక్కుతుందన్నది ఆసక్తిగా మారింది. దేవరకద్రలోనూ డీసీసీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, ప్రదీప్ కుమార్ గౌడ్, కొండా ప్రశాంత్​రెడ్డి, కొత్త అర్వింద్ కుమార్​రెడ్డి రేసులో ఉన్నారు. జడ్చర్లలో ఐదుగురు దరఖాస్తు చేసుకుంటే మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్, అనిరుద్​రెడ్డి మధ్య పోటీ తీవ్రంగా ఉంది.

Ticket War in Telangana Congress : కాంగ్రెస్​లో కలహాలు.. తారాస్థాయికి చేరిన టికెట్​ కొట్లాట

Congress Ticket War Palamuru : నారాయణపేట నుంచి ఆరుగురు పోటీలో ఉండగా.. మాజీ డీసీసీ అధ్యక్షుడు కుంభం శివకుమార్​రెడ్డి , హర్షవర్ధనరెడ్డి, సుగప్ప మధ్య పోటీ ఉంది. జడ్చర్ల నుంచి ఎర్రశేఖర్‌కు అభ్యర్థిత్వం దక్కకపోతే.. ఆయనను నారాయపేణ నుంచి పోటీలో నిలపాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మక్తల్‌ నియోజకవర్గంలో ఏడుగురు దరఖాస్తు చేసుకోగా.. తాజాగా పార్టీలో చేరిన కొత్తకోట సీతా దయాకర్​రెడ్డి ఆమె కుమారుని కోసం టిక్కెట్ ఆశిస్తున్నారు. వనపర్తి నియోజకవర్గంలో ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి, యూత్కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి ఇద్దరూ సీనియర్ నాయకులే. వీరితో పాటు ఇటీవల జూపల్లితో పార్టీలో చేరిన మేఘారెడ్డి టిక్కెట్ ఆశిస్తున్నారు. ఈ ముగ్గురిలో సర్వేలు ఎవరికి అనుకూలిస్తాయన్నది ఆసక్తిగా మారింది. షాద్‌నగర్‌లో నలుగురు అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నారు. శంకర్, శ్రీనివాస్ మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది.

Ticket Disputes in Telangana Congress : నాగర్​కర్నూల్ జిల్లాలోనూ పాతనాయకులకు, కొత్తగా పార్టీలో చేరిన నేతలకు మధ్య అభ్యర్థిత్వం కోసం తీవ్రమైన పోటీ నడుస్తోంది. నాగర్​కర్నూల్ నుంచి పది మంది దరఖాస్తు చేసుకోగా.. నాగం జనార్థన్​రెడ్డి లేదా ఆయన కుమారుడు శశిధర్​రెడ్డికి టిక్కెట్ కావాలని ఆశిస్తున్నారు. ఇటీవలే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్సీ.. కూచకుళ్ల దామోదర్​రెడ్డి ఆయన కుమారుడు రాజేశ్​రెడ్డికి టిక్కెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

Congress MLA Tickets Applications 2023 : తరలివచ్చిన ఆశావహులు.. 1000 దాటిన దరఖాస్తులు

Kollapur Congress MLA Ticket Issue :కొల్లాపూర్ నియోజక వర్గంలోనూ ఇన్నేళ్లు పార్టీకి సేవలందించిన జగదీశ్వర్​రావు టిక్కెట్(MLA Ticket) ఆశిస్తుండగా.. ఇటీవలే పార్టీలో చేరిన మాజీ మంత్రి జూపల్లి సైతం సీటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలో ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్న చల్లా వంశీచంద్​రెడ్డితో పాటు ఇటీవలే పార్టీలో చేరిన సుంకిరెడ్డి రాఘవేందర్​రెడ్డికి మధ్య పోటీ ఉంది. అచ్చంపేట టిక్కెట్ కోసం ఐదుగురు దరఖాస్తు చేసుకున్నా.. అభ్యర్థిత్వం మాత్రం మాజీ ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణకు దక్కే అవకాశాలున్నాయి. గద్వాల నియోజకవర్గంలోనూ సీనియర్ నాయకులకు.. ఇటీవలే పార్టీలో చేరిన జడ్పీ ఛైర్​పర్సన్ సరితకు మధ్య పోటీ నడుస్తోంది. తెలంగాణలో ఎలాగైనా పాగా వేయాలని భావిస్తున్న కాంగ్రెస్.. పార్టీనే నమ్ముకున్న పాతనేతలకు పోటీ చేసే అవకాశం కల్పిస్తుందా.. కొత్తగా పార్టీలో చేరిన వాళ్లలో గెలుపు గుర్రాలను ఎంపిక చేస్తుందా అనేది వేచిచూడాలి.

Telangana Congress Focus on MLA Candidates Selection : కాంగ్రెస్ తరఫున పోటీచేసేందుకు అభ్యర్థుల చొరవ.. టికెట్‌ కోసం లాబీయింగ్​లు

Telangana Congress MLA Candidates First List : నెలాఖరులో కాంగ్రెస్ ఎమ్మెల్యే​ అభ్యర్థుల తొలి జాబితా!

ABOUT THE AUTHOR

...view details