తెలంగాణ

telangana

ETV Bharat / state

Congress Ticket Issues in Mahabubnagar District : ఉమ్మడి పాలమూరులో అసంతృప్తి మంటలు.. కాంగ్రెస్‌కు పెద్ద సవాలే

Congress Ticket Issues in Mahabubnagar District : ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అన్ని శాసనసభ స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు గుర్రాలెవరో తేలిపోయింది. అభ్యర్థుల ప్రకటన పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. కానీ టికెట్ ఆశించి భంగపడ్డ నేతల భవిష్యత్ కార్యాచరణ ఏంటన్నదే ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. మొదట 8 స్థానాలు ప్రకటించినప్పుడు.. కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, గద్వాల నియోజక వర్గాల్లో అసమ్మతి వెల్లువెత్తింది. తాజాగా 6 స్థానాల అభ్యర్థుల ప్రకటనతో ఏం జరగబోతుందన్నది ఆసక్తిగా మారింది.

Telangana Congress
Telangana Congress

By ETV Bharat Telangana Team

Published : Oct 28, 2023, 7:39 AM IST

Congress Ticket Issues in Mahbubnagar District ఉమ్మడి పాలమూరులో అసంతృప్తి మంటలు.. కాంగ్రెస్‌కు పెద్ద సవాలే

Congress Ticket Issues in Mahabubnagar District :ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని(Joint Mahabubnagar District) 14 శాసనసభ నియోజకవర్గాల్లో.. బీఆర్ఎస్‌ను ఢీకొట్టే కాంగ్రెస్‌ గుర్రాలెవరో తేలిపోయింది. మొదట 8 స్థానాలను ప్రకటించిన హస్తం పార్టీ మిగిలిన 6 స్థానాల అభ్యర్థులను సైతం ప్రకటిచింది. అభ్యర్థుల ప్రకటనతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మహబూబ్‌నగర్‌ - యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జడ్చర్ల- అనిరుధ్‌ రెడ్డి, దేవరకద్ర- మధుసూదన్ రెడ్డి, నారాయణపేట- పర్ణికారెడ్డి, వనపర్తి- చిన్నారెడ్డి, మక్తల్‌లో వాకిటి శ్రీహరి అభ్యర్థిత్వాన్ని దక్కించుకున్నారు.

ఉమ్మడి జిల్లాలోని అన్ని స్థానాలకూ అభ్యర్థుల్ని ప్రకటించడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ పెరిగింది. కానీ టికెట్ ఆశించి భంగపడ్డ నాయకుల భవిష్యత్ కార్యాచరణ ఏంటన్న అంశమే ప్రస్తుతం ఉత్కంఠను రేపుతోంది. మొత్తం 14 నియోజకవర్గాల్లో 5 స్థానాలు ఇటీవలే ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారికి కేటాయించారు. దీంతో ఇన్నేళ్లు పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నేతలు ఏ మాత్రం జీర్ణించుకోలేక పోతున్నారు.

Revanth Reddy Counter Tweet to KTR Tweet : 'రాష్ట్రంలో కాంగ్రెస్ సునామీ చూసి.. కేటీఆర్​కు ఏం చేయాలో అర్థం కావట్లేదు'

Telangana Congress MLA Candidates List :నాగర్‌కర్నూల్‌లో టికెట్ దక్కని సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి (Nagam Janardhan Reddy) త్వరలోనే తన భవిష్యత్ కార్యచరణను ప్రకటిస్తానని వెల్లడించారు. గద్వాలలో సరితకు సీటు కేటాయించడాన్ని నిరసిస్తూ డీసీసీ అధ్యక్షుడు సహా 200 మంది పార్టీకి రాజీనామా చేశారు. టికెట్లు అమ్ముకున్నారంటూ గాంధీ భవన్‌లో నిరసనకు దిగిన కురవ విజయ్ కుమార్ (Kurava Vijay Kumar) సస్పెన్షన్‌కు గురయ్యారు. తాజాగా ప్రకటించిన ఆరు స్థానాల్లోనూ కీలక నేతలు టికెట్లు ఆశించారు.

Mahabubnagar District Politics :మహబూబ్‌నగర్‌లో బీసీ లేదా మైనార్టీలకు సీటివ్వాలన్న డిమాండ్ ఉన్నా అది నెరవేరలేదు. జడ్చర్ల, నారాయణపేట ఏదో స్థానంలో టికెట్ దక్కుతుందని భావించిన ఎర్ర శేఖర్‌కు మొండి చెయ్యే ఎదురయింది. వనపర్తిలో నిరంజన్ రెడ్డిని ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్‌లో చేరిన మేఘారెడ్డి రెండో జాబితాలో చోటు దక్కలేదు. దేవరకద్ర, నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాల్లోనూ కీలక నేతలు టికెట్ ఆశించినా.. నిరాశే ఎదురైంది.

Telangana Congress MLA Candidates Second List : కీలక స్థానాలతో కాంగ్రెస్ రెండో జాబితా.. లిస్టులో గద్దర్ కుమార్తె, అజహరుద్దీన్

Telangana Assembly Elections 2023 : వీరి భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుందన్న అంశమే.. ప్రస్తుతం ఉమ్మడి పాలమూరు జిల్లా రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. కొల్లాపూర్‌లో జూపల్లి కృష్ణారావుకు టికెట్ కేటాయించడాన్ని నిరసిస్తూ అసమ్మతి బావుటా ఎగురవేసిన చింతలపల్లి జగదీశ్వరరావు.. జానారెడ్డి (Janareddy) బుజ్జగింపులతో తిరిగి పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని ప్రకటించారు. అలా పెల్లుబికే అసమ్మతిని చల్లార్చడం ప్రస్తుతం హస్తం పార్టీకి సవాలుగా మారనుంది.

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 14 నియోజకవర్గాల్లో.. 9 స్థానాలు అగ్రవర్ణాలకు కేటాయించగా, రెండు ఎస్సీ రిజర్వ్‌డ్‌ స్థానాలు. బీసీలకు దక్కిన సీట్లు మూడే. బీసీ వాదం బలపడుతున్న.. ఆ ప్రభావం పార్టీ గెలుపోటములపై పడే అవకాశం ఉంది. మొత్తంగా టిక్కెట్లు ఆశించి భంగపడ్డ వారిని, సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆయా సామాజిక వర్గాలను ఎలా కలుపుకుని పోతారన్న అంశమే ప్రాధాన్యం సంతరించుకుంది. అసంతృప్తులంతా రాజకీయ భవిష్యత్‌ కోసం పార్టీలు మారుతున్న తరుణంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏం జరగబోతోందో వేచిచూడాల్సిందే.

Congress Field work stalled to candidates List Late : క్షేత్రంలో కొరవడుతున్న కాంగ్రెస్​.. జానారెడ్డి నేతృత్వంలో బుజ్జగింపుల పర్వం

T Congress Party Public Meeting on October 31st : ఈనెల 31న కొల్లాపూర్​లో కాంగ్రెస్​ బహిరంగ సభ.. 28 నుంచి రెండో విడత బస్సుయాత్ర..!

ABOUT THE AUTHOR

...view details