మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండల కేంద్రంలో ఫీల్డ్ అసిస్టెంట్లు చేపట్టిన నిరవధిక సమ్మె 9వ రోజుకు చేరుకుంది. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఫీల్డ్ అసిస్టెంట్లు చేస్తున్న సమ్మె కు కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతిచ్చారు. పనిచేసే సిబ్బందిని ఇబ్బంది పెట్టడం సరైన పద్ధతి కాదని టీపీసీసీ సంయుక్త కార్యదర్శి ప్రదీప్ కుమార్ గౌడ్ మండిపడ్డారు.
ఉపాధి హామీ క్షేత్ర సహాయకుల సమ్మెకు కాంగ్రెస్ మద్దతు - latest news on Congress supports field assistants strike at devarakadra in mahabubnagar
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్షేత్ర సహాయకుల సమ్మె 9వ రోజుకు చేరింది. పీసీసీ సంయుక్త కార్యదర్శి కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ దేవరకద్ర మండల కేంద్రంలో సహాయకులకు సంఘీభావం తెలిపారు.
ఉపాధి హామీ క్షేత్ర సహాయకుల సమ్మెకు కాంగ్రెస్ మద్దతు
క్షేత్ర సహాయకుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించాలని డిమాండ్ చేశారు. గ్రామీణ నిరుపేదల వలసలను నివారించి.. కనీస ఉపాధి కల్పించాలనే ఆకాంక్షతో చేపట్టిన పథకానికి ప్రభుత్వం కొత్త కొత్త జీవోలు తెచ్చి తూట్లు పొడుస్తోందని ఆరోపించారు.
ఇదీ చదవండి:కరోనా ఎఫెక్ట్: నిర్మానుష్యంగా మారిన కరీంనగర్