దేశవ్యాప్తంగా కరోనా సంక్షోభం వెంటాడుతున్న తరుణంలో పెట్రోల్, డీజిల్ ధరలను అనాలోచితంగా పెంచడం పట్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసనకు దిగారు. అధిష్ఠానం ఇచ్చిన పిలుపు మేరకు మహబూబ్నగర్లో కాంగ్రెస్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టి.. కార్యాలయం ప్రధాన గేటు ఎదుట నిరసనకు దిగారు.
ఇంధన ధరల పెంపును నిరసిస్తూ కలెక్టరేట్ ఎదుట ధర్నా - ఇంధన ధరల పెంపును నిరసిస్తూ కలెక్టరేట్ ఎదుట ధర్నా
కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలు ఓ వైపు ఇబ్బందులు పడుతుంటే.. మరోవైపు కేంద్రం మానవత్వాన్ని మరచి పెట్రోల, డీజిల్ ధరలు పెంచుతోందని కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడ్డారు. పెరుగుతున్న పెట్రో ధరలను నిరసిస్తూ మహబూబ్నగర్ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు.
ఇంధన ధరల పెంపును నిరసిస్తూ కలెక్టరేట్ ఎదుట ధర్నా
గత 21 రోజులుగా ప్రభుత్వం ఇంధన ధరలను పెంచుతూ పోతోందని.. దీని వల్ల సామాన్యులపై అదనపు భారం పడుతోందని మండిపడ్డారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు భారీగా పడిపోయినా.. కేంద్రం పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాలు పెంచి భారీగా దండుకుంటోందని దుయ్యబట్టారు. ఇంధన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:హైదరాబాద్లో మరోసారి లాక్డౌన్..!