మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తనను పార్లమెంట్‌కు పంపిస్తే జిల్లాను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. అన్ని వర్గాల ప్రజలు తమకు అండగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని హామీలే తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తాము ప్రచారానికి ఎక్కడికి వెళ్లిన ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తుందని వెల్లడించారు.
పార్లమెంట్లో పాలమూరు గళాన్ని వినిపిస్తా: వంశీచంద్ రెడ్డి - మహబూబ్‌నగర్‌లో వంశీచంద్ రెడ్డి ప్రచారం
తెలంగాణ ఏర్పాడ్డాక కూడా జిల్లా అభివృద్ధికి అమడదూరంలో ఉందని మహబూబ్‌నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి విమర్శించారు. పాలమూరులో కార్యాకర్తలు తలపెట్టిన ద్విచక్రవాహన ర్యాలీలో పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్‌లో వంశీచంద్ రెడ్డి ప్రచారం