తెలంగాణ

telangana

ETV Bharat / state

'కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే చేనేతపై ఉన్న జీఎస్టీని ప్రభుత్వమే భరిస్తుంది' - మహబూబ్‌నగర్‌ తాజా వార్తలు

Jairam Ramesh on GST on Handloom Sector: రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే చేనేత వస్త్రాలపై ఉన్న 5 శాతం జీఎస్టీని ప్రభుత్వమే భరించేలా తగు ఏర్పాట్లు చేస్తామని.. కాంగ్రెస్‌ ఎంపీ జైరాం రమేశ్ పేర్కొన్నారు. రాహుల్‌ గాంధీ చేస్తోన్న భారత్‌ జోడో యాత్రలో పాల్గొన్న ఆయన.. మధ్యాహ్న విరామం సమయంలో విలేకర్లతో కాసేపు ముచ్చటించారు.

Jairam Ramesh
Jairam Ramesh

By

Published : Oct 29, 2022, 7:26 PM IST

Jairam Ramesh on GST on Handloom Sector: రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే చేనేత వస్త్రాలపై ఉన్న 5 శాతం జీఎస్టీని ప్రభుత్వమే భరించేలా ఏర్పాటు చేస్తామని ఎంపీ జైరాం రమేశ్ ప్రకటించారు. కేసీఆర్‌ ప్రభుత్వానికి ఆ అవకాశం ఉన్నప్పటికీ.. పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. మహబూబ్‌నగర్‌లో రాహుల్‌ గాంధీ చేస్తోన్న భారత్‌ జోడో యాత్రలో పాల్గొన్న ఆయన.. ఎనుగొండ శిబిరం వద్ద మధ్యాహ్న భోజన సమయంలో మీడియాతో మాట్లాడారు.

రాహుల్‌ గాంధీ భారత్‌ జోడోయాత్రలో భాగంగా మూడు బృందాలకు చెందిన వారితో మాట్లాడారని ఆయన వివరించారు. పద్మశ్రీ గజం అంజయ్యతోనూ రాహుల్‌ భేటీ అయ్యారని పేర్కొన్నారు. అంతేకాకుండా చేనేత కార్మికులు, పాలమూరు అధ్యయన వేదిక, తెలంగాణలో విద్యారంగంపై చర్చించినట్లు ఆయన తెలిపారు. ప్రధాని మోదీ చేనేతతో ముడిపడి ఉన్న అన్ని ప్రభుత్వ సంస్థలను మూసివేశారని జైరాం రమేశ్ ధ్వజమెత్తారు. 5 శాతం జీఎస్టీతో భాజపా ప్రభుత్వం చేనేత రంగాన్ని చంపుతుందని దుయ్యబట్టారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details