కరోనా సమయంలో పరీక్షల పేరుతో విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడటం సమంజసం కాదని కాంగ్రెస్ నేతలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హితువు పలికారు. రాష్ట్రంలో నిర్వహించనున్న జేఈఈ, నీట్ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ మహబూబ్‌నగర్ కలెక్టరేట్ ముందు నిరసన ప్రదర్శన చేపట్టారు.
జేఈఈ, నీట్ పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ కాంగ్రెస్ ధర్నా - తెలంగాణ తాజా వార్తలు
కరోనా వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్న సమయంలో జేఈఈ, నీట్ పరీక్షలు నిర్వహించడాన్ని నిరసిస్తూ మహబూబ్‌నగర్ కలెక్టరేట్ ముందు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ధర్నా చేపట్టాయి. కొవిడ్ పూర్తిగా తగ్గిన తర్వాతనే పరీక్షలు నిర్వహించాలని కోరారు.
జేఈఈ, నీట్ పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ కాంగ్రెస్ ధర్నా
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరీక్షలు నిర్వహిస్తామని చెప్పటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారన్నారు. కరోనా వ్యాప్తి పూర్తి స్థాయిలో తగ్గిన తర్వాతే.. పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.