రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సంక్రాంతి లోపు ప్రత్యేక శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసి.. కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని ఏఐసీసీ కార్యదర్శి వంశీ చంద్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతులకు ఉపయోగపడే విధంగా కొత్త చట్టాలను తీసుకురావాలని కోరుతూ మహబూబ్‌నగర్ కలెక్టరేట్‌ను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముట్టడించాయి. పార్టీ కార్యాలయం నుంచి నేతలు ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ముందు బైఠాయించారు.
'మోదీని కలిసిన తర్వాత కేసీఆర్ స్పందించడం లేదు' - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్
రైతులకు ఉపయోగపడే విధంగా కొత్త చట్టాలను తీసుకురావాలని కోరుతూ మహబూబ్ నగర్ కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. పీఎం మోదీని కలిసిన తర్వాత సాగు చట్టాలపై సీఎం కేసీఆర్ స్పందించడం లేదని ఆరోపించారు.
కార్పొరేట్ కంపెనీల లాభం కోసమే రైతు వ్యతిరేక చట్టాలను కేంద్రం తీసుకొచ్చిందని ఆరోపించారు. నూతన సాగు చట్టాలకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతిస్తోందని ఆరోపించారు. వ్యవసాయ చట్టాలకు నిరసనగా దేశవ్యాప్తంగా చేపట్టిన బంద్‌కు కేసీఆర్ మద్దతు ఇచ్చారని... కానీ ప్రధాని మోదీని కలిసిన తర్వాత స్పందించడం లేదని విమర్శించారు. సాగు చట్టాలు రద్దు చేసేంత వరకూ రైతులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు.
ఇదీ చదవండి:హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సంస్థ భారీ పెట్టుబడులు