మహబూబ్‌నగర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు లిమిటెడ్ ఆవరణలో జడ్చర్లకు చెందిన పలువురు ఖాతాదారులు ఆందోళన నిర్వహించారు. తమ డిపాజిట్లను తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు.
డీసీసీబీ జనరల్ మేనేజర్ పదవీ విరమణ పొందుతున్న సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బ్యాంకు ఆడిటోరియంలో ఉద్యోగులు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమం కొనసాగుతుండగా.. అక్కడికి చేరుకున్న జడ్చర్ల డీసీసీబీ బ్యాంకు ఖాతాదారులు నిరసన చేపట్టారు. ఖాతాదారుల నుంచి వసూలు చేసిన డిపాజిట్లను చెల్లించాలంటూ డిమాండ్ చేశారు.
డిపాజిట్ల గడువు ముగియడం వల్ల తమ డబ్బులు తిరిగి చెల్లించాలని గత కొన్ని రోజులుగా కోరుతున్నా.. బ్యాంకు అధికారులు స్పందించడం లేదంటూ ఖాతాదారులు వాపోయారు. డిపాజిట్లను తిరిగి చెల్లిస్తామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చినా.. ఇప్పటి వరకు నగదు చెల్లింపులు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. డిపాజిట్లను తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చిన అప్పటి బ్యాంకు అధికారి, ప్రస్తుత డీసీసీబీ జనరల్ మేనేజర్ పదవీ విరమణ పొందుతుండటం వల్ల తమకు నగదు చెల్లించాలని అధికారులను నిలదీశారు. ఈ ఘటనతో ఉద్యోగులు హడావిడిగా సన్మాన కార్యక్రమాన్ని ముగించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఇదీచూడండి.. టీఎన్జీవో నూతన అధ్యక్షుడిగా మామిడ్ల రాజేందర్