Competition For Congress MLA Tickets in Joint Mahabubnagar District :ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో సిట్టింగ్‌లనే.. బీఆర్ఎస్ అభ్యర్ధులుగా ఖరారు చేసి ముందే కదనరంగంలోకి దిగింది. కేసీఆర్‌ని ఎలాగైనా గద్దె దించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న కాంగ్రెస్ మాత్రం.. ఇంకా గెలుపు గుర్రాల వేటలోనే ఉంది. భారత్ రాష్ట్ర సమితిని ఢీకొట్టే సత్తా ఉన్నవారిని ఎంపిక చేయడం.. హస్తం పార్టీకి అంత సులువైన పనికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Congress MLA Ticket Fight :కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా (Congress MLA Tickets) పోటీచేసేందుకు.. భారీగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. వారిలోంచి గెలిచేవారిని ఎంపికచేయడం, అసంతృప్తులని బుజ్జగించడం.. గ్రూపు రాజకీయాలు పక్కన పెట్టి అంతా పార్టీ విజయం కోసం పనిచేసేలా చేయడం హస్తం పార్టీకి కత్తిమీద సామే. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రాతినిధ్యం వహిస్తున్న మహబూబ్‌నగర్‌లో.. కాంగ్రెస్‌నుంచి పోటీకి ఆరుగురుపైగా ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు.
Revanthreddy on Assembly Seats : 'రాష్ట్రంలో 100 సీట్లు గెలిపించే బాధ్యతను నేను తీసుకుంటా'
ప్రముఖ న్యాయవాది వెంకటేశ్, మాజీ డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్,.. సంజీవ్ ముదిరాజ్, బెక్కరి అనితతోపాటు.. శ్రీనివాస్‌గౌడ్‌పై న్యాయస్థానాల్లో పోరాటాలు చేస్తున్న రాఘవేందర్‌రాజు వంటివారు ఉన్నారు. అందులో ఎవరు బరిలో నిలుస్తారన్నది అధిష్ఠానం నిర్ణయించాల్సిందే. జడ్చర్ల నుంచి మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్, అనిరుథ్‌రెడ్డి సహా పలువురు టికెట్ ఆశిస్తున్నారు. దేవరకద్ర నుంచి మహబూబ్‌నగర్ డీసీసీ అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, బీసీ నేత ప్రదీప్‌గౌడ్.. ప్రశాంత్‌రెడ్డి సహా కురుమూర్తి దేవస్థానం మాజీ ఛైర్మన్ రాధాకృష్ణారెడ్డి పోటీలో ఉన్నారు.
నారాయణపేట కోసం మాజీ డీసీసీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి, టీఆర్‌టీయూ వ్యవస్థాపకుడు గాల్‌రెడ్డి హర్షవర్థన్‌రెడ్డి సహా సుజేంద్రశెట్టి, సుగప్ప దరఖాస్తు చేశారు. మక్తల్‌లోనూ ఆశావహుల జాబితా పెద్దదిగానే ఉంది. నారాయణపేట డీసీసీ అధ్యక్షుడు వాకిటిశ్రీహరి, ప్రశాంత్‌రెడ్డి.. నాగరాజుగౌడ్, విష్ణువర్థన్‌రెడ్డి, పోలీస్ చంద్రశేఖర్‌రెడ్డి ఉన్నారు. చిన్నారెడ్డి వంటి సీనియర్ నేత సొంత నియోజకవర్గంలోనూ ఆశావహుల మధ్య పోటీ తప్పేలాలేదు. చిన్నారెడ్డితో సహా ఇటీవలే జూపల్లితోపాటు కాంగ్రెస్‌లో చేరిన (Congress) మేఘారెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి, మొగిలి సత్యారెడ్డి వంటివారు దరఖాస్తు చేసుకున్నారు.