మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ వెంకట్రావు రాత్రి ఆకస్మికంగా ఎన్నికల పోలింగ్ కేంద్రాలను జడ్చర్ల పురపాలికలను తనిఖీ చేశారు. పలు పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లను సమీక్షించి కొవిడ్ నిబంధనలపై అధికారులకు సూచనలు చేశారు. పురపాలిక ఎన్నికల్లో కొవిడ్ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ వెంకట్రావు అధికారులకు ఆదేశించారు. జ్వరం, దగ్గు, జలుబు ఎలాంటి లక్షణాలు ఉన్న పోలింగ్ కేంద్రాల్లో ఎవరిని అనుమతించవద్దని సూచించారు.
పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ వెంకట్రావ్
మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ వెంకట్రావు ఆకస్మికంగా ఎన్నికల పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. పలు పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లను సమీక్షించి కొవిడ్ నిబంధనలపై అధికారులకు సూచనలు చేశారు.
collector
ప్రతి కేంద్రంలో శానిటైజర్ మాస్కులు భౌతిక దూరం పాటించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పురపాలికలోని హౌసింగ్ బోర్డ్ విద్యానగర్ కాలనీలోని పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లపై సహాయ ఎన్నికల అధికారి సునీతకు సూచనలు చేశారు. క్విడ్ నిబంధనలపై అన్ని జాగ్రత్తలు పాటించాలని నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ఓటర్లు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.