మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న లే అవుట్లను తనిఖీ చేసేందుకు ప్రత్యేక బృందాలను నియమించినట్లు పాలనాధికారి ఎస్.వెంకటరావు వెల్లడించారు. నియోజకవర్గ స్థాయిలో క్లస్టర్, జిల్లాస్థాయిలో తనిఖీ బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ బృందాలు వారికి కేటాయించిన పురపాలక, గ్రామ పంచాయతీలలోని లే అవుట్లను పరిశీలించి నివేదికలు సమర్పిస్తారని తెలిపారు. రెండు బృందాలు ప్రతినెల ఒకటో తేదీన జరిగే సమీక్షా సమావేశంలో నివేదికలను సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు.