తెలంగాణ

telangana

ETV Bharat / state

డిసెంబర్ 4న మహబూబ్​నగర్​కు ముఖ్యమంత్రి కేసీఆర్ - CM KCR tour in Mahbubnagar latest news

CM KCR Tour In Mahabubnagar: సీఎం కేసీఆర్ డిసెంబర్ 4న మహబూబ్​నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించడంతో పాటు.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

CM KCR tour in Mahabubnagar
CM KCR tour in Mahabubnagar

By

Published : Nov 20, 2022, 4:23 PM IST

CM KCR Tour In Mahabubnagar: ముఖ్యమంత్రి కేసీఆర్ డిసెంబర్ 4న మహబూబ్​నగర్ జిల్లాకు రానున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి చెప్పారు. ఈ సందర్భంగా నూతన కలెక్టరేట్​ను, బహిరంగ సభ నిర్వహించే ఎంవీఎస్ కళాశాల మైదానాన్ని జిల్లా అధికారులతో కలిసి పరిశీలించారు. గతంలో అదే మైదానంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సభ నిర్వహించారని.. అక్కడే ప్రస్తుతం భారీ బహిరంగసభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారని అన్నారు.

పాత కలెక్టరేట్ స్థానంలో నూతనంగా నిర్మించబోయే మల్టీ స్పెష్టాలిటీ ఆసుపత్రికి అదే రోజు సీఎం శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. పార్టీ కార్యాలయం, మినీ స్టేడియం వద్ద అభివృద్ధి పనులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. డిసెంబర్​లోనే మహబూబ్ నగర్​లో నర్సింగ్ కళాశాల సైతం ప్రారంభిస్తామని మంత్రి తెలియజేశారు.

ABOUT THE AUTHOR

...view details