తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఓటర్లు పరిణితితో ఓటేస్తే ప్రజాస్వామ్యం గెలుస్తుంది - సరిగ్గా వాడితే మంచి భవిష్యత్‌ ఉంటుంది' - దేవరకద్రలో బీఆర్​ఎస్​ ప్రజా ఆశీర్వాద సభ

CM KCR Speech at Devarakadra Public Meeting : ఎన్నికల్లో పార్టీలు పోటీ చేయడం, గెలుపోటములు సహజమని బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. ఓటర్లు అభ్యర్థుల గుణగణాలు పరిశీలించి ఓటేయాలని సూచించారు. అభ్యర్థి వెనుక ఉన్న పార్టీల గురించి కూడా ఆలోచన చేయాలన్నారు. ఈ క్రమంలోనే ఓటర్లు పరిణితితో ఓటేస్తే ప్రజాస్వామ్యం గెలుస్తుందని.. ఓటును సరిగ్గా వాడితే మంచి భవిష్యత్‌ ఉంటుందని స్పష్టం చేశారు.

praja ashirwada sabha
CM KCR Speech at Devarakadra Public Meeting

By ETV Bharat Telangana Team

Published : Nov 6, 2023, 4:15 PM IST

Updated : Nov 6, 2023, 7:10 PM IST

CM KCR Speech at Devarakadra Public Meeting : ప్రజ‌ల ద‌గ్గర ఉండే ఒక వ‌జ్రాయుధమే ఓటు అని.. రాబోయే ఐదేళ్ల మన భ‌విష్యత్‌ను నిర్ణయిస్తుందని బీఆర్​ఎస్​ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఆషామాషీగా, అల‌వోక‌గా ఓటు వేయకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజాస్వామ్యంలో ఆశించిన ప‌రిణితి భారతదేశంలో రావ‌డం లేదని.. పరిణితి వచ్చిన దేశాలు గొప్పగా దూసుకుపోతున్నాయని వివరించారు. రాజకీయ పార్టీల నడవడిక, విధానం, ప్రజల గురించి ఆలోచించే సరళి, అధికారం అప్పగిస్తే ఏ విధంగా పరిపాలన చేస్తారని ప్రజలు చూడాల్సిన అవసరం ఉందన్నారు.

సీఎం కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య - తప్పిన ప్రమాదం

ఎన్నికల్లో పార్టీలు పోటీ చేయడం, గెలుపోటములు సహజం. అభ్యర్థుల గుణగణాలు పరిశీలించి ఓటేయాలి. అభ్యర్థి వెనుక ఉన్న పార్టీల గురించి కూడా ఆలోచన చేయాలి. ఓటర్లు పరిణితితో ఓటేస్తే.. ప్రజాస్వామ్యం గెలుస్తుంది. ఓటును సరిగ్గా వాడితే మంచి భవిష్యత్‌ ఉంటుంది. - కేసీఆర్‌, బీఆర్​ఎస్​ అధినేత, ముఖ్యమంత్రి

ఓటర్లు పరిణితితో ఓటేస్తే ప్రజాస్వామ్యం గెలుస్తుంది సరిగ్గా వాడితే మంచి భవిష్యత్‌ ఉంటుంది

ఈ క్రమంలోనే పాల‌మూరు జిల్లా.. ఒక‌ప్పుడు పాలుగారిన జిల్లా అని. అలాంటి అద్భుత‌మైన జిల్లాను స‌మైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రులు దత్తత తీసుకున్నా బాగుపడలేదని కేసీఆర్‌ పేర్కొన్నారు. పునాది రాళ్లు వేశారే తప్ప.. గుక్కెడు నీళ్లు అందించలేదని మండిపడ్డారు. కృష్ణా, తుంగ‌భ‌ద్ర న‌దులు ఒరుసుకుంటూ పారే ఈ జిల్లాలో గంజి కేంద్రాలు పెట్టించే గ‌తి కాంగ్రెస్‌ పార్టీ ప‌ట్టించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్న తెలంగాణ‌ను ఊడ‌గొట్టి.. సమైక్యాంధ్రలో కలిపి మ‌న ప్రాజెక్టుల‌ను ర‌ద్దు చేశారని అన్నారు.

దీపావళి తర్వాత సీఎం కేసీఆర్ మూడో విడత ఎన్నికల ప్రచారం - ఈసారి ఏకంగా రోజుకు 4 నియోజకవర్గాల్లో సభలు

2004లో తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్‌ పార్టీ పొత్తు పెట్టుకుని మోసం చేసిందని కేసీఆర్ గుర్తు చేశారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మాటలు విని.. బీఆర్​ఎస్​ పార్టీని ముంచి ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేశారన్నారు. ఆ తర్వాత వంద‌ల మంది ఆత్మ బలిదానాలు, ఉవ్వెత్తున ఉద్యమం ఎగిసిప‌డితే.. త‌ప్పనిసరి పరిస్థితుల్లో గ‌తిలేక కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ‌ను ఇచ్చిందని కేసీఆర్‌ తెలిపారు.

గుర్తుల గుర్తుంచుకో రామక్క - మా పార్టీని గుర్తుంచుకో రామక్క ప్రధాన పార్టీల నోట రామక్క పాట ఇప్పుడిదే టాప్ ట్రెండింగ్

కరివెన జలాశయం ఎక్కడ కట్టాలని.. ఈ నియోజకవర్గంలోనే గుట్టలన్నీ స్వయంగా తిరిగానని కేసీఆర్ గుర్తు చేశారు. తక్కువ నష్టంతో ఎక్కువ నీళ్లు రావాలని స్వయంగా పరిశీలన చేశానన్నారు. కరివెన రిజర్వాయర్‌ పనులు పూర్తి కావొచ్చాయని.. అందుబాటులోకి వస్తే దేవరకద్ర నియోజకవర్గంలో మొత్తం 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని సీఎం కేసీఆర్‌ వివరించారు. ఈ క్రమంలోనే ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయని, పార్టీ న‌డ‌వ‌డిక‌, విధానం, ప్రజ‌ల గురించి ఆలోచ‌న స‌ర‌ళి, అభ్యర్థి మంచి చెడులు చూసి ఓటేయాలని పిలుపునిచ్చారు.

తొమ్మిదిన్నరేళ్ల ప్రగతే లక్ష్యంగా బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రచార జోరు

Last Updated : Nov 6, 2023, 7:10 PM IST

ABOUT THE AUTHOR

...view details