తెలంగాణ

telangana

ETV Bharat / state

CM KCR Review on Palamuru Rangareddy Project : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై నేడు సీఎం కేసీఆర్ సమీక్ష - ముఖ్యమంత్రి కేసీఆర్ తాజా వార్తలు

CM KCR Review on Palamuru Rangareddy Project today : సీఎం కేసీఆర్‌ నేడు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలపై సంబంధిత అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఇంజినీర్లతో విస్తృతంగా చర్చించనున్నారు.

CM KCR Review on Palamuru Rangareddy Project today
CM KCR Review on Palamuru Rangareddy Project

By ETV Bharat Telangana Team

Published : Sep 6, 2023, 6:54 AM IST

CM KCR Review on Palamuru Rangareddy Project Today : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ మధ్యాహ్నం సచివాలయంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఇంజినీర్లతో సీఎం సమావేశం కానున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశానికి హాజరు కానున్నారు. ప్రాజెక్టుకు సంబందించిన అన్ని అంశాలపై సీఎం కేసీఆర్ విస్తృతంగా చర్చించనున్నారు.

Palamuru Rangareddy Dry Run Success : 'పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఆవిష్కృతం.. తెలంగాణ సాగునీటి రంగంలో మరో కాళేశ్వరం'

CM KCR Review on PRLIS Today : ప్రాజెక్టుకు సంబంధించి ఇటీవలే డ్రైరన్ నిర్వహించారు. డ్రైరన్ విజయవంతం కావడంతో వెట్ రన్‌కు సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే ప్రాజెక్టు ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. 15 లేదా 17 తేదీల్లో ప్రారంభోత్సవం చేసే అవకాశం ఉందని అంటున్నారు. కరివెన జలాశయం వరకు నీటిని తరలించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ పరిస్థితుల్లో ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ సమీక్షించనున్నారు. అక్కడక్కడా పూర్తి చేయాల్సిన పనులు, క్షేత్రస్థాయి ఇబ్బందులు, తదితరాలపై సీఎం దృష్టి సారించనున్నారు. కాల్వల నిర్మాణానికి సంబంధించిన ప్రక్రియను కూడా ప్రారంభించింది. ఆ అంశాలపై కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించి నిర్ణయాలు తీసుకోనున్నారు.

Palamuru Rangareddy Lift Irrigation Scheme Inauguration : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని నార్లాపూర్ వద్ద ఇటీవల నిర్వహించిన డ్రైరన్‌ను ఇంజినీరింగ్‌ అధికారులతో కలిసి ప్రారంభించిన అనంతరం అక్కడే సంబంధిత అధికారులతో ప్రాజెక్ట్‌ పనులపై రాష్ట్ర నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ సమీక్షించారు. ఈ సందర్భంగా నార్లాపూర్‌ వద్ద 4 మోటార్లను అమర్చామని.. అందులో మొదటి పంపును విజయవంతంగా పరీక్షించామన్నారు. మరో 15 రోజుల్లో ఒక పంపు ద్వారా నీళ్లను ఎత్తిపోసే ప్రక్రియ ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.

Palamuru Rangareddy Lift Irrigation Project : 'పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు మంజూరు'

ఒక మోటార్ 3 వేల క్యూసెక్కుల నీటిని ఎత్తి పోస్తుందని.. నిబంధనల ప్రకారం ముందుగా నార్లాపూర్ రిజర్వాయర్‌ను నింపిన తర్వాత 45 రోజుల్లో ఏదుల, వట్టెం, కరివెన జలాశయాల వరకు ఆ నీళ్లు తీసుకొస్తామన్నారు. పర్యావరణ అనుమతులు వచ్చాక.. గత 3 వారాలుగా ఇంజినీర్లు, సిబ్బంది రాత్రి, పగలు పని చేస్తున్నారని వివరించారు. చిన్న చిన్న సమస్యలు, పనులు మిగిలి ఉన్నాయని.. మిషన్ భగీరథకు సంబంధించి వట్టెం వద్ద పైపు మార్చే పనులతో పాటు కుడికిళ్ల వద్ద డీప్ కట్ సమస్యను సైతం పరిష్కరిస్తామన్నారు. ఉత్తర తెలంగాణలో కాళేశ్వరం మాదిరిగా.. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మహబూబ్‌నగర్ జిల్లాకు వరదాయిని అని అభివర్ణించారు.

సాగునీటి రంగంలో మరో కాళేశ్వరం.. : ఇటీవల నార్లాపూర్‌ వద్ద డ్రైరన్‌ విజయవంతం కావడం పట్ల మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఆవిష్కృతమవుతోన్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో తెలంగాణ జల విజయ పతాకం సగర్వంగా ఎగురుతోందని మంత్రి అన్నారు. నీటి కోసం తండ్లాడిన నేలల్లో.. సుజల దృశ్యం సాక్షాత్కారం అయిందని పేర్కొన్నారు. తెలంగాణ సాగు నీటి రంగంలో మరో కాళేశ్వరంగా అభివర్ణించారు. అవాంతరాలు, అడ్డంకులను అధిగమిస్తూ... కుట్రలు, కేసులను గెలుస్తూ.. జల సంకల్పంతో అనుమతులు సాధించి దశాబ్దాల కలను సాకారం చేస్తూ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి అవుతోందని చెప్పారు. బీళ్లకు కృష్ణమ్మ బిరబిరా.. నీళ్లందించనుందని తెలిపారు. ఇది తెలంగాణ జలశక్తి అని కేటీఆర్ ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనంగా అభివర్ణించారు.

CM KCR: 'పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులు పరుగులు పెట్టాలి'

Palamuru-Rangareddy Lift Irrigation Project Status : పరుగులు పెడుతున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు

ABOUT THE AUTHOR

...view details