త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు జిల్లాకు రానున్నారని రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. సీఎం రాకతో జిల్లా సమగ్ర అభివృద్ధికి ముందడుగు పడనుందని అభిప్రాయపడ్డారు. మహబూబ్‌నగర్ పట్టణం మీదుగా నీటి పారుదల కాలువ నిర్మాణానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు పేర్కొన్నారు. కలెక్టర్ రొనాల్డ్‌రోస్‌తో కలిసి పట్టణంలోని కూడళ్ల సుందరీకరణ, బైపాస్ రహదారి పనులను ఆయన పరిశీలించారు. మహబూబ్‌నగర్ - జడ్చర్ల రహదారి పట్టణ ప్రజల చిరకాల వాంఛగా మంత్రి పేర్కొన్నారు. కూడళ్ల వద్ద రోడ్డు ఆక్రమించి దుకాణాలు నడుపుతున్న వారంతా స్వచ్ఛందంగా ఖాళీ చేయాలని సూచించారు.
త్వరలో పాలమూరుకు సీఎం కేసీఆర్: మంత్రి శ్రీనివాస్ గౌడ్ - kcr
త్వరలో పాలమూరు జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటిస్తారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. కలెక్టర్ రోనార్డ్రోస్తో కలిసి పట్టణంలోని కూడళ్ల సుందరీకరణ, బైపాస్ రహదారి పనులను ఆయన పరిశీలించారు.
త్వరలో పాలమూరుకు సీఎం కేసీఆర్: మంత్రి శ్రీనివాస్ గౌడ్