తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏ తెలంగాణ కోరుకున్నామో అది సాకారమవుతోంది: సీఎం కేసీఆర్ - KCR started TRS party office

KCR Mahbubnagar Tour:​ పదవులు శాశ్వతం కాదని.. ఉన్నపుడు ఎం చేశామనేది ముఖ్యమని... అదే ఎంతో సంతృప్తినిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. ఎనిమిదేళ్లలో అందరి అంచనాలు, అనుమానాలను తలకిందులు చేస్తూ తెలంగాణ అద్భుత ప్రగతి సాధిస్తోందని ఉద్ఘాటించారు. తెరాస సర్కార్‌ ఏ పథకం అమలుచేసినా.. అది మానవీయ కోణంలోనే ఉంటుందన్నారు. కంటి వెలుగు, కేసీఆర్‌ కిట్‌ ఆ కోవలోకే వస్తాయని వివరించారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగుల సహకారంతో తెలంగాణ అద్భుత ఫలితాలు సాధించిందని కొనియాడారు.

KCR
KCR

By

Published : Dec 4, 2022, 2:27 PM IST

Updated : Dec 4, 2022, 7:37 PM IST

ఏ తెలంగాణ కోరుకున్నామో అది సాకారమవుతోంది: సీఎం కేసీఆర్

KCR Mahbubnagar Tour: మహబూబ్‌నగర్‌ పర్యటనలో తొలుత ముఖ్యమంత్రి పాలకొండ వద్ద 22 ఎకరాల్లో 55 కోట్ల రూపాయలతో నిర్మించిన నూతన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు. పాలమూరు జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం.. ఎన్నో అనుమానాల మధ్య ఏర్పడ్డ తెలంగాణ ప్రస్తుతం అభివృద్ధిలో తారాపథంలో దూసుకెళుతోందన్నారు.

ప్రభుత్వాధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టి కృషితో ఏ తెలంగాణ కోరుకున్నామో... దాన్ని సాకారం చేసుకునే బాటలో ఉన్నామని వివరించారు. ఇదే ఒరవడితో అంకితభావంతో పనిచేసి రాష్ట్రాన్ని అగ్రపథాన నిలపాలని సీఎం ఆకాంక్షించారు. తెరాస సర్కార్‌ ఏ పథకం ప్రవేశపెట్టినా.. అందులో మానవీయ కోణం ఉంటుందన్న సీఎం కేసీఆర్‌ కిట్‌, కంటి వెలుగు ఆ కోవలోకే వస్తాయన్నారు. బృంద స్ఫూర్తితో పనిచేస్తే ఎలాంటి అద్భుతాలు వస్తాయో అనడానికి తెలంగాణ నిదర్శనమన్నారు.

'కంటి వెలుగు పథకం వెనక ఎంతో పరమార్థం ఉంది. ఈ పథకం ఓట్ల కోసం తెచ్చింది కాదు. అధికారులు అంకితభావంతో కంటివెలుగును విజయవంతం చేయాలి. ఏ పథకం తెచ్చినా.. సమగ్ర చర్చ, ఒక దృక్పథం ఉంటుందని తెలుసుకోవాలి. కేసీఆర్‌ కిట్‌ కూడా ఆషమాషీగా తెచ్చింది కాదు. మహిళలు గర్భిణీగా ఉన్నప్పుడు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. అలాంటి సమయంలో వారు ఆదాయం కోల్పోవద్దనే డబ్బు ఇస్తున్నాం. గర్భిణీలు డబ్బు, కూలీ గురించి ఆలోచించొద్దని భావించాం. టీకాలను నిర్లక్ష్యం చేయొద్దనే టీకాలు వేయిస్తే డబ్బులిస్తున్నాం. సామాజిక, మానవీయ దృక్పథంతో పథకాలు తీసుకొస్తున్నాం. సంస్కరణలు నిరంతర ప్రక్రియ. ఒక దశతో ముగిసేవి కావు. తెలంగాణ చిమ్మచీకటి అవుతుందని శపించిన వారూ ఉన్నారు. అందరి అంచనాలు తలకిందులు చేసి అద్భుత ప్రగతి సాధిస్తున్నాం. ఈ ఎనిమిదేళ్లలో ప్రజలు అందించిన సహకారం భవిష్యత్‌లోనూ కొనసాగించాలి.'-సీఎం కేసీఆర్

అంతకుముందు మహబూబ్‌నగర్‌ కొత్త కలెక్టరేట్‌లో.. మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, జిల్లా ఎమ్మెల్యేలు కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కొత్త కలెక్టరేట్ భవనాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కలెక్టర్‌ వెంకట్రావును సీటులో కూర్చొబెట్టి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా... కలెక్టర్ కార్యాలయంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. మహబూబ్‌నగర్‌ అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద నిర్మించిన.. తెరాస జిల్లా పార్టీ కార్యాలయాన్ని కేసీఆర్‌ ప్రారంభించారు. నూతన పార్టీ కార్యాలయంలో.. గులాబీ జెండా ఎగురవేశారు. పార్టీ నాయకులకు శుభాకాంక్షలు చెప్పారు.

ఇవీ చదవండి:డాక్టర్‌ కావాలనుకున్నా.. కానీ నాన్న చెప్పిన ఆ మాటలతో..!

పాక్ చిన్నారికి కేరళ వైద్యుల పునర్జన్మ.. ప్రపంచంలోనే అరుదైన ఆపరేషన్ చేసి..

Last Updated : Dec 4, 2022, 7:37 PM IST

ABOUT THE AUTHOR

...view details