సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మహబూబ్నగర్ ప్రభుత్వాస్పత్రిని సందర్శించారు. ప్రభుత్వాస్పత్రిలో కరోనా రోగులకు ఇస్తున్న చికిత్సల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో చాలా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని భట్టి తెలిపారు. వీటిని చూస్తుంటే చాలా బాధగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
''ఆస్పత్రిలో చాలా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇలా ఉంటే ప్రజలను, రోగులను ఎవరు చూసుకుంటారు. రోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉంటే... ఉన్న డాక్టర్లే వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. వైద్యులు ఒత్తిడంతా తీసుకుని... కనీసం విశ్రాంతి కూడా తీసుకోకుండా పేషేంట్లను కాపాడేందుకు పని చేస్తున్నారు.''