తెలంగాణ

telangana

ETV Bharat / state

శ్రీశైలం ప్రమాదంపై సీఐడీ విచారణ ప్రారంభం - శ్రీశైలం అగ్ని ప్రమాదంపై సీఐటీ విచారణ

శ్రీశైలం జల విద్యుత్​ కేంద్రంలో జరిగిన ప్రమాదంపై... గోవింద్​ సింగ్​ నాయకత్వంలో సీఐడీ విచారణ ప్రారంభమైంది. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన బృందం సభ్యులు... ఘటనకు గల కారణాలపై ఆరా తీశారు. సొరంగ మార్గంలోకి వెళ్లి పరిశీలించినట్టు తెలుస్తోంది.

శ్రీశైలం ప్రమాదంపై సీఐడీ విచారణ ప్రారంభం
శ్రీశైలం ప్రమాదంపై సీఐడీ విచారణ ప్రారంభం

By

Published : Aug 22, 2020, 8:59 PM IST

శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సీఐడీ విచారణ ప్రారంభమైంది. విచారణాధికారి గోవింద్ సింగ్ నాయకత్వంలోని సుమారు 25మందితో కూడిన బృందం ఇవాళ శ్రీశైలం జల విద్యుత్ కేంద్రాన్ని సందర్శించింది. తొలత ఈగలపెంటలోని జెన్కో అతిధి గృహంలో సీఈ, డీఈ, ఈఈ స్థాయి అధికారులతో బృందం సమావేశమైంది.

ఘటన జరిగిన తీరు, ప్రమాదానికి కారణమైన పరిస్థితులు, ఇతర అంశాలు సిబ్బందిని అడిగి బృందం తెలుసుకుంది. అక్కడి నుంచి భూగర్భంలో ఘటన జరిగిన ప్రాంతాన్ని కూడా సభ్యులు పరిశీలించారు. సొరంగంలో అవకాశం ఉన్నంత మేర లోపలికి బృందం వెళ్లినట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన ప్రాంతం, అత్యవసర మార్గాలు అన్నింటినీ పరిశీలించినట్టు సమాచారం.

ABOUT THE AUTHOR

...view details