ప్రేమానురాగాలు, దయాగుణానికి ప్రతీక క్రైస్తవులని... ఈ క్రిస్మస్ వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆకాంక్షించారు. మహబూబ్ నగర్లోని ఎంబీసీ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం కేక్ కట్ చేసి క్రైస్తవులకు శుభాకాంక్షలు చెప్పారు.
సర్వమతాల సౌభ్రాతృత్వమే తెరాస లక్ష్యం - CHRISTMAS Celebrations in Mahabubnagar Minister Srinivas goud Attend the Celebrations
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఎంబీసీ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. సర్వమతాల సౌభ్రాతృత్వమే తెరాస లక్ష్యమని పేర్కొన్నారు.
సర్వమతాల సౌభ్రాతృత్వమే తెరాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సర్కారు క్రైస్తవుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తోందని గుర్తు చేశారు. తొలిసారి క్రిస్మస్ వేడుకల్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దుస్తుల పంపిణీ, నిరుపేదల దంపతులకు షాదీ ముబారక్ పథకం ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నట్లు వెల్లడించారు. సర్వ మతాల సౌభ్రాతృత్వమే తెరాస లక్ష్యమన్నారు.
ఇదీ చూడండి: ఇవాళ క్రిస్మస్ పర్వదినం