మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఈ నెల 13న చిన్నారి కిడ్నాప్ కేసును పోలీసులు చేధించారు. అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో గుర్తుతెలియని దుండగులు పాపను ఎత్తుకెళ్లాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు. నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పరిసర జిల్లాలతో పాటు హైదరాబాద్, రాయచూర్లోనూ గాలించారు. అపహరణకు ఉపయోగించిన ఆటో ద్వారా దుండగులు జిల్లా కేంద్రంలోనే ఉన్నట్టు గుర్తించి చాకచక్యంగా పట్టుకున్నారు. కేవలం డబ్బుల కోసమే చిన్నారులను అపహరించి 10 వేలకు అమ్ముకుంటున్నారని జిల్లా ఎస్పీ రాజేశ్వరి తెలిపారు. నలుగురు నిందితులను అరెస్టు చేశామని వెల్లడించారు. పాపను తల్లిదండ్రులకు అప్పగించారు.
పిల్లలను కిడ్నాప్ చేస్తారు..10వేలకు అమ్ముకుంటారు.. - పిల్లలను కిడ్నాప్ చేస్తారు..10వేలకు అమ్ముకుంటారు..
డబ్బుల కోసం చిన్నారులను అపహరించి అమ్ముకుంటున్న ముఠాకు మహబూబ్నగర్ పోలీసులు చెక్ పెట్టారు. ఈనెల 13న కిడ్నాపైన చిన్నారిని రక్షించారు.
పిల్లలను కిడ్నాప్ చేస్తారు..10వేలకు అమ్ముకుంటారు..