తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈసారి కూడా ముందస్తు ఎన్నికలకు కేసీఆర్: కిషన్‌రెడ్డి

kishan reddy comments: తెరాస ప్రభుత్వం తీరుపై కేంద్రమంత్రి కిషన్​రెడ్డి విరుచుకుపడ్డారు. మహబూబ్​నగర్​లో భాజపా బహిరంగ సభలో పాల్గొన్న కిషన్​రెడ్డి... భాజపా భయంతోనే కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని ఆరోపించారు. ఈసారి కూడా మళ్లీ ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ వెళ్తారని జోస్యం చెప్పారు.

kishan reddy
kishan reddy

By

Published : May 5, 2022, 10:17 PM IST

ఈసారి కూడా ముందస్తు ఎన్నికలకు కేసీఆర్: కిషన్‌రెడ్డి

kishan reddy fires on trs: కేసీఆర్‌కు ఐదేళ్ల కోసం అధికారం ఇస్తే ముందే ప్రభుత్వాన్ని రద్దు చేశారని కేంద్ర మంత్రి కేషన్​రెడ్డి పేర్కొన్నారు. మహబూబ్​నగర్​లో ఏర్పాటు చేసిన భాజపా బహిరంగ సభలో పాల్గొన్న ఆయన కేసీఆర్ ప్రభుత్వంపై తనదైన శైలీలో విమర్శలు చేశారు. భాజపా భయంతోనే కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని ఆరోపించారు. పాలమూరు ప్రజలు ఎప్పుడూ భాజపాకు అండగా నిలుస్తున్నారని వెల్లడించారు. ఈసారి కూడా కేసీఆర్‌ మళ్లీ ముందస్తు ఎన్నికలకు వెళ్లేలా ఉన్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. 2023లో ఎన్నికలు జరిగితే ఓడిపోతాననే భయం కేసీఆర్‌కు పట్టుకుందన్నారు.

kishan reddy fires on kcr: కేటీఆర్‌ను సీఎం చేయాలని కేసీఆర్‌ తహతహలాడుతున్నారని విమర్శించారు. నిజమైన తెలంగాణ ఉద్యమకారులు తెరాస పార్టీలో లేరని తెలిపారు. తెలంగాణను వ్యతిరేకించిన ద్రోహులే తెరాసలో ఉన్నారన్నారు. తెలంగాణను వ్యతిరేకించిన మజ్లిస్‌తో కలిసి మోదీపై విష ప్రచారం చేస్తున్నారని వెల్లడించారు. నిజాంను తరిమికొట్టి జాతీయ జెండా ఎగరవేసిన ధీరులు తెలంగాణ ప్రజలని కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ గడ్డపై ఎగిరేది కాషాయ జెండా మాత్రమేనని ఆశాభావం వ్యక్తం చేశారు.

''రాష్ట్రంలో విచిత్రమైన రాజకీయ పరిస్థితి ఉంది. పాలమూరు జిల్లాకు భాజపాకు అవినాభావ సంబంధం ఉంది. కేసీఆర్ పుత్రవాత్సల్యంతో తహతహలాడుతున్నారు. కేటీఆర్​ను ముఖ్యమంత్రి చేసేందుకు ఫామ్ హౌజ్​లో కూర్చొని వ్యూహాలు రచిస్తున్నారు. భాజపా బలపడుతుందని కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారు. తెరాసలో ఉద్యమ ద్రోహులు ఉన్నారు. తెలంగాణ జెండా.. కమలం పువ్వు జెండా. కేసీఆర్ నీ ఫ్రంట్​లు.. టెంట్​లు ఎక్కడికి పోయాయి. నిజాం నిరంకుశ పాలన కేసీఆర్ సాగిస్తున్నారు. తెరాస మోసపూరిత మాటలను ప్రజలు నమ్మొద్దు. ప్రగతి భవన్ కాదు అది.. కల్వకుంట్ల భవన్.''

- కిషన్​రెడ్డి, కేంద్రమంత్రి

kishan reddy comments: కల్వకుంట్ల కుటుంబ పాలనకు ప్రజలు చరమగీతం పాడుతారని చెప్పారు. కేసీఆర్‌ చెప్పిన ఫ్రంట్‌లు, టెంట్‌లు ఏమయ్యాయన్నారు. ప్రతిపక్షాలకు ధర్నా చేసే అవకాశం లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ మాత్రం దిల్లీలో ధర్నా చేశారు.. ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు.యాసంగిలో వడ్లు కొనేది లేదని చెప్పి రైతులకు నష్టం చేశారని వివరించారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details