కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ప్రతి అసెంబ్లీ పరిధిలో 1500, పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో సుమారు 10 వేల మందికి తగ్గకుండా కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొనాలన్నారు.
ఆన్లైన్ ప్రచారాన్ని విజయవంతం చేయాలి ! మోదీ అనాలోచిత నిర్ణయాల వల్లే...
లాక్డౌన్ అమలులో భాగంగా ప్రధాని మోదీ అనాలోచిత నిర్ణయాల వల్ల వలస జీవులు అగమయ్యారని ఎద్దేవా చేశారు. పూర్తి భద్రతతో, ప్రభుత్వ ఖర్చుతో వారిని వాహనాల్లో సొంత రాష్ట్రానికి చేర్చాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు.
లాక్డౌన్ కారణంగా చితికిపోయిన నిరుపేద కుటుంబాలకు రూ.10 వేల రూపాయలను నేరుగా ఖాతాలోకే బదిలీ చేయాలని కోరారు. చిరు వ్యాపారులకు గ్రాంట్స్తో పాటు ఉపాధి హామీ పని దినాలను 100 నుంచి 200 రోజులకు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చేపట్టనున్న ఆన్లైన్ ప్రచారాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
'కరోనా కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం' ఇవీ చూడండి : మంచిర్యాల జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు