తెలంగాణ

telangana

ETV Bharat / state

మహబూబ్​నగర్​ జిల్లాలో రాజకీయ హత్య

మహబూబ్​నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని డోకూరులో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.

మహబూబ్​నగర్​ జిల్లాలో రాజకీయ హత్య..?

By

Published : Jun 5, 2019, 8:24 AM IST

Updated : Jun 5, 2019, 8:49 AM IST

దేవరకద్ర మండలంలోని డోకూరుకు చెందిన ప్రేమ్ ​కుమార్​ మంగళవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. రాజకీయ ఘర్షణలతోనే హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిన్న వెలువడిన ఎంపీటీసీ ఫలితాల్లో స్థానికంగా భాజపా విజయం సాధించింది. ఆ సందర్భంగా భాజపాకు మద్దతుగా కొందరు యువకులు బాణాసంచా కాలుస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న ప్రేమ్​ కుమార్​కు ప్రత్యర్థి వర్గం నేతలకు మధ్య ఘర్షణ జరిగింది. అర్ధరాత్రి సమయంలో జీనుగురాల రోడ్డులో ప్రేమ్​కుమార్​ దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

మహబూబ్​నగర్​ జిల్లాలో రాజకీయ హత్య
Last Updated : Jun 5, 2019, 8:49 AM IST

ABOUT THE AUTHOR

...view details