తెలంగాణ

telangana

ETV Bharat / state

Mbnr Bjp Protest: పాలమూరులో భాజపా నిరసన... హాజరుకానున్న ఫడణవీస్ - Mahabubnagar protest news

Mbnr Bjp Protest: మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయ, ఉద్యోగ, నిరుద్యోగ సమస్యలపై భాజపా నిరసన కార్యక్రమం చేపట్టదలిచింది. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ హాజరుకానున్నారు.

Bjp
Bjp

By

Published : Jan 11, 2022, 5:25 AM IST

Mbnr Bjp Protest: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ఇవాళ రాష్ట్రానికి రానున్నారు. ఉదయం శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి నేరుగా రోడ్డు మార్గం ద్వారా మహాబూబ్‌నగర్‌కు వెళ్తారు. ఉపాధ్యాయ, ఉద్యోగ, నిరుద్యోగ సమస్యలపై భాజపా ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్‌ ఎనుగొండ జేజేఆర్‌ గార్డెన్స్‌లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నాం 12.30వరకు నిర్వహించే నిరసన కార్యక్రమంలో పాల్గొంటారు.

ఈ నిరసన కార్యక్రమంలో దేవేంద్ర ఫడణవీస్​తో పాటు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, డీకే అరుణ, లక్ష్మణ్‌, జితేందర్‌ రెడ్డి పాల్గొననున్నట్లు భాజపా ప్రకటించింది.

ఇవీచూడండి:

ABOUT THE AUTHOR

...view details