మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో భాజపా ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ విధానానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం జరిగింది. ముందుగా పట్టణంలో పార్టీ నేతలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.
ఎల్ఆర్ఎస్కు వ్యతిరేకంగా దేవరకద్రలో భాజపా భారీ ర్యాలీ - ఎల్ఆర్ఎస్ను తిరస్కరిస్తూ దేవరకద్రలో భాజపా నేతలు నిరసన
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ విధానానికి వ్యతిరేకంగా.. భారతీయ జనతా పార్టీ మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో నిరసన ర్యాలీ నిర్వహించింది. అనంతరం పార్టీ నేతలు తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
ఎల్ఆర్ఎస్కు వ్యతిరేకంగా దేవరకద్రలో భాజపా భారీ ర్యాలీ
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎగ్గని నర్సింలు.. ఎల్ఆర్ఎస్ విధానంలో ఉన్న లోపాలను వివరిస్తూ ప్రభుత్వ తీరును విమర్శించారు. ఈ నిరసన ర్యాలీలో స్థానిక నాయకులు యజ్ఞ భూపాల్ రెడ్డి, అంజన్ కుమార్ రెడ్డి, నారాయణ రెడ్డి రాజు, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:రెవెన్యూ సమస్యలపై మంత్రి కేటీఆర్ సమీక్ష
TAGGED:
BJP protest at Devarakadra