రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేయాలని భారతీయ జనతా పార్టీ మహబూబ్ నగర్ నేతలు డిమాండ్ చేశారు. అలాగే పేదలకు రెండు పడక గదుల ఇళ్లను వెంటనే అందించాలని జిల్లా అధ్యక్షుడు ఎర్ర శేఖర్ డిమాండ్ చేశారు. పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీ చేపట్టిన శ్రేణులు కలెక్టరేట్ ముట్టడించారు. కరోనా నేపథ్యంలో ఇప్పటికే పేద ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని... ఇప్పుడు ఎల్‌ఆర్ఎస్ పథకం పేరుతో వారిని మరింత ఇబ్బందులకు గురి చేయవద్దని కోరారు.
ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలని కలెక్టరేట్ ముట్టడి - మహబూబ్నగర్ కలెక్టరేట్ ముట్టడించిన బీజేపీ
ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్‌ఆర్‌ఎస్ పథకానికి నిరసనగా భాజపా శ్రేణులు మహబూబ్‌నగర్‌లో నిరసన తెలిపారు. పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీ చేపట్టిన శ్రేణులు కలెక్టరేట్ ముట్టడించారు. పేదలకు రెండు పడక గదుల ఇళ్లను వెంటనే అందించాలని జిల్లా అధ్యక్షుడు ఎర్ర శేఖర్ డిమాండ్ చేశారు.
ఎల్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేయాలి: జిల్లా భాజపా అధ్యక్షుడు
తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికే ఆరేళ్లయనా.. ఇళ్లు ఇస్తామని ఊరడిస్తున్నారే తప్ప.... రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా పూర్తి చేసే పరిస్థితి లేదన్నారు. పేదలకు రెండు పడక గదుల ఇళ్లు ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ రద్దు చేసే వరకు పోరాడతామని... పేదల పక్షానా ఉంటామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:ఎల్‌ఆర్‌ఎస్‌ను వ్యతిరేకిస్తూ... భాజపా నిరసన