తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సీఎం నిద్రపోతున్నారా?' - సీఎం కేసీఆర్​పై డీకే అరుణ కమెంట్స్

అకాల వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సీఎం కేసీఆర్... ఫామ్​హౌస్​లో నిద్రపోతున్నారా అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల డిజైన్లు కేవలం కమీషన్ల కోసమే మార్చారని ఆరోపించారు.

'ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సీఎం నిద్రపోతున్నాడా?'
'ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సీఎం నిద్రపోతున్నాడా?'

By

Published : Oct 18, 2020, 4:58 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాజెక్టుల్లో పాల్పడుతున్న అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని కేంద్రానికి లేఖ రాయబోతున్నట్లు భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ వెల్లడించారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల డిజైన్లు కేవలం కమీషన్ల కోసమే మార్చారని ఆరోపించారు. అండర్‌ గ్రౌండ్‌ పంప్‌ హౌస్‌ సరికాదని ఇంజినీర్ల బృందం చెప్పినా... ప్రభుత్వం ముందుకెళ్లిందని విమర్శించారు.

అండర్ గ్రౌండ్ పంప్​హౌస్ వద్దని ఉమ్మడి మహుబూబ్​నగర్ నాయకులు లేఖ రాశారని... వారిలో తెరాస మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని తెలిపారు. ప్రాజెక్ట్​లపై సీబీఐ విచారణ జరిపించాలని కేంద్రానికి లేఖ రాస్తామని అరుణ పేర్కొన్నారు. వర్షాలతో పంట నష్టపోతే పట్టించుకొనే నాథుడే లేడని దుయ్యబట్టారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే కేసీఆర్ ఫామ్​హౌస్​లో నిద్రపోతున్నాడా అని మండిపడ్డారు.

ఇదీ చదవండి:నాగార్జునసాగర్‌ 18 క్రస్టు గేట్లు ఎత్తి నీటి విడుదల

ABOUT THE AUTHOR

...view details