జాతీయ పౌరపట్టిక, పౌరసత్వ సవరణ చట్టంపై కాంగ్రెస్, మజ్లిస్ సహా కొన్ని ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని భాజపా నేత, ఎమ్మెల్సీ రామచందర్‌రావు ఆరోపించారు. జాతీయ పౌర పట్టిక భాజపా తీసుకొచ్చింది కాదన్నారు. మహబూబ్‌నగర్ భాజపా కార్యాలయంలో కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. సీఏఏ ఏ మతాన్నో.. వర్గాన్నో ఉద్దేశించి తీసుకువచ్చింది కాదని స్పష్టం చేశారు.
సీఏఏ, ఎన్పీఆర్పై ప్రతిపక్షాలది తప్పుడు ప్రచారం: ఎమ్మెల్సీ రామచందర్‌రావు - సీఏఏ, ఎన్పీఆర్పై ప్రతిపక్షాలది తప్పుడు ప్రచారం: ఎమ్మెల్సీ రామచందర్‌రావు
జాతీయ పౌరపట్టిక, పౌరసత్వ సవరణ చట్టంపై ప్రతిపక్షాలు ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని ఎమ్మెల్సీ రామచందర్‌రావు ఆరోపించారు. పురపాలక ఎన్నికల్లో భాజపాకు అండగా నిలవాలని కోరారు.
![సీఏఏ, ఎన్పీఆర్పై ప్రతిపక్షాలది తప్పుడు ప్రచారం: ఎమ్మెల్సీ రామచందర్‌రావు mlc ramchandar rao](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5584585-1059-5584585-1578060733947.jpg)
సీఏఏ, ఎన్పీఆర్పై ప్రతిపక్షాలది తప్పుడు ప్రచారం: ఎమ్మెల్సీ రామచందర్‌రావు
సీఏఏ, ఎన్పీఆర్పై ప్రతిపక్షాలది తప్పుడు ప్రచారం: ఎమ్మెల్సీ రామచందర్‌రావు
ప్రతిపక్షాలు, వామపక్ష భావజాలం కలిగిన విద్యార్థి సంఘాలు మాత్రమే తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. కొన్ని వర్గాల వారిని దేశం నుంచి పంపించివేస్తారంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. మజ్లిస్ పార్టీ తెరాసను కూడా మభ్యపెట్టిందన్నారు. పురపాలక ఎన్నికల్లో తెరాస, కాంగ్రెస్‌కు వేసే ప్రతి ఓటు మజ్లిస్‌కు వేసినట్లేనని తెలిపారు.
ఇవీచూడండి: 'పౌర' చట్టం అమలుపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు: షా