తెలంగాణ

telangana

ETV Bharat / state

మండలిలో నా రికార్డులను చూసి మాట్లాడాలి: రాంచందర్​రావు - mahabubnagar district latest news

తాను ఏం చేశానని ప్రశ్నించే వాళ్లు.. మండలిలో రికార్డులను చూసి మాట్లాడాలని భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి రాంచందర్​రావు పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రులు కేటీఆర్​, నిరంజన్​రెడ్డిలు చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. విపక్షాలకు ఓటు వేయొద్దంటూ ఓటర్లను బెదిరించటం ఏంటని ప్రశ్నించారు. తన మాటల పట్ల నిరంజన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

bjp mlc candidate ramchander rao fires on ministers ktr and niranjan reddy
మండలిలో నా రికార్డులను చూసి మాట్లాడాలి: రాంచందర్​రావు

By

Published : Mar 4, 2021, 12:26 PM IST

మండలిలో నా రికార్డులను చూసి మాట్లాడాలి: రాంచందర్​రావు

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రులు కేటీఆర్​, నిరంజన్​రెడ్డి చేసిన వ్యాఖ్యలపై భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి రాంచందర్​రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. న్యాయవాదులకు తాను ఏం చేశానంటూ కేటీఆర్ అడిగిన ప్రశ్నలకు ఇప్పటికే చాలాసార్లు సమాధానం ఇచ్చానంటూ వ్యాఖ్యానించారు. విపక్షాల మాటలు విని తెరాసకు ఓటు వేయకపోతే.. తీవ్ర పరిణామాలుంటాయని మంత్రి నిరంజన్​రెడ్డి చేసిన వ్యాఖ్యలపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో ఎవరినైనా ఎన్నుకునే హక్కు ఓటర్లకు ఉంటుందని స్పష్టం చేశారు.

పీఆర్సీ, ఐఆర్ జాప్యంపై సమాధానం ఇవ్వకుండా ఉద్యోగులను బెదిరించటం ఏంటని ప్రశ్నించారు. చేసిన వ్యాఖ్యల పట్ల నిరంజన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి బెదిరించినా.. ఉద్యోగులు భయపడి పోవద్దని, 2023లో రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. అధికారంలోకి రాగానే పీఆర్సీ, పదోన్నతులు, ఫిట్​మెంట్ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగులకు భాజపా అండగా ఉంటుందని భరోసా కల్పించారు.

రికార్డులు చూసి మాట్లాడాలి..

ఈ సందర్భంగా తాను మండలిలో ప్రశ్నించకపోతే న్యాయ వాదులకు ఇచ్చిన రూ.100 కోట్లు బయటకు వచ్చేవి కావని రాంచందర్​రావు పేర్కొన్నారు. ప్రభుత్వం న్యాయవాదులకు రూ.25 కోట్లు ఇవ్వడానికంటే ముందు.. జూనియర్ న్యాయవాదులను ఆదుకోవాలంటూ ముఖ్యమంత్రికి లేఖ రాసినట్లుగా ఆయన గుర్తు చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు జీతాలు సరిగ్గా రావడం లేదని ఆరోపించారు. మండలిలో ప్రజా సమస్యలతో పాటు.. న్యాయవాదుల సమస్యలపై పోరాటం చేశానని చెప్పారు. తాను ఏం చేశానని ప్రశ్నించే వాళ్లు.. మండలిలో రికార్డులను చూసి మాట్లాడాలని కోరారు.

న్యాయవాదులను కలవనున్న రాంచందర్​రావు..

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ మహబూబ్​నగర్, వనపర్తి, నాగర్​కర్నూల్, కల్వకుర్తి కోర్టుల్లోని న్యాయవాదులను రాంచందర్​రావు కలవనున్నారు. ఈ సందర్భంగా న్యాయవాదుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి వెళ్లాలన్నా.. వాటిపై మండలిలో గళం వినిపించాలన్నా భాజపా అభ్యర్థి రాంచందర్​రావును మండలికి పంపాలని బార్ కౌన్సిల్ ఛైర్మన్ నర్సింహరెడ్డి న్యాయవాదులకు విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి: న్యాయవాదుల హత్యకేసు: నిందితులు కోర్టులో హాజరు

ABOUT THE AUTHOR

...view details