వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఓటమి ఖాయమని భాజపా నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పునరుద్ఘాటించారు. అధిష్ఠానం ఆదేశిస్తే కేసీఆర్‌పై పోటీ చేసి ఓడిస్తానన్నారు. 'పల్లె గోస-భాజపా భరోసా' కార్యక్రమంలో భాగంగా ఆయన దేవరకద్ర నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈరోజు సీసీ కుంట మండలం అప్పంపల్లికి చేరుకున్న ఆయన అక్కడ తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
అధిష్ఠానం ఆదేశిస్తే కేసీఆర్‌పై పోటీకి సై.. వచ్చే ఎన్నికల్లోనూ అదే రిపీట్: ఈటల
అధిష్ఠానం ఆదేశిస్తే.. కేసీఆర్‌పై పోటీకి సై అని మరోసారి ప్రకటించారు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. రాబోయే ఎన్నికల్లోనూ... హుజూరాబాద్ ప్రజలు ఇచ్చిన తీర్పే రిపీట్ అవుతుందని దీమా వ్యక్తం చేశారు.
అధిష్ఠానం ఆదేశిస్తే కేసీఆర్‌పై పోటీకి సై.. వచ్చే ఎన్నికల్లోనూ అదే రిపీట్
అంతకముందు జడ్చర్లలోనూ కార్యకర్తలతో సమావేశయ్యారు. సీఎం కేసీఆర్, తెరాస పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజా విశ్వాసం కోల్పోయారన్నారు. ఎమ్మెల్యేలు ఏ పార్టీకి రాజీనామా చేసి భాజపాలో చేరినా ఆహ్వానిస్తామని స్పష్టంచేశారు. హుజూరాబాద్ ప్రజలు ఇచ్చిన తీర్పే రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో రిపీటవుతుందని.. కేసీఆర్ దుర్మార్గాలు, కుట్రలు, అబద్ధాలు, మాయమాటలను తెలంగాణ సమాజం నమ్మడానికి సిద్ధంగా లేదని ఈటల వ్యాఖ్యానించారు.